Akkineni amala birthday special

akkineni amala birthday special, nagarjuna akhil born on 1968 september 12th

akkineni amala birthday special

4.gif

Posted: 09/12/2012 12:53 PM IST
Akkineni amala birthday special

        చిత్ర రంగ ప్రవేశంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని అనంతరం అక్కినేని వారిఇంట కోడలిగా అడుగిడి ఉత్తమ ఇల్లాలిగా సమాజసేవకులరాలిగా పరిపూర్ణ జీవితాన్ని గడుపుతోన్న అమల బర్త్డే ఇవాళ. సో.. అమల జీవిత విశేషాలు మీకోసం..amala_inneree
         1968, సెప్టెంబర్ 12న అమల పశ్చిమ బెంగాల్ లో జన్మించింది. తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన వనిత కాగా, తండ్రి అచ్చమైన బెంగాలీ. అమల తండ్రి నేవీ ఉద్యోగం కారణంగా ఆమె చిన్నతనం అంతా విశాఖ పట్నంలో గడించింది. తరువాత చెన్నయ్ లో ఆమె జీవితాన్ని గడిపింది. చిన్నతనం నుంచే ఆమె భరత నాట్యం నేర్చుకుంది. అమల టి.రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన మైధలీ ఎన్నాయ్ కథాలీ అనే తమిళ సినిమాతో చిత్ర రంగంలోకి ప్రవేశించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అమలకు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత అమల నటించిన పుష్పక్, అగ్ని నక్షత్రం వంటి సినిమాలు ఆమెను స్టార్ హీరోయిన్ చేశాయి. ఈ సినిమాలు తెలుగులోనూ విడుదల అయ్యి అమలకు ఇక్కడా మంచి గుర్తింపు తెచ్చాయి. తెలుగు amala_innereసినిమాల అవకాశాలు తెచ్చి పెట్టాయి. అటు తరువాత అమల హిందీ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. రజనీకాంత్, కమల్ హసన్, చిరంజీవి, ముమ్మట్టి, మోహన్ లాల్ వంటి ఆగ్రహీరోల సరసన నటించింది. మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖ దర్శకుల సినిమాలలో నటించింది. హీరో అక్కినేని నాగార్జునతో నిర్ణయం, శివ సినిమాలలో నటించింది. ఆ క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పరిణయంకు దారి తీసింది.
      1992లో నాగార్జునతో వివాహం తరువాత అమల సినిమాలకు దూరంగా ఉంటుంది. హైదరాబాద్ లో బ్లూ క్రాస్ సంస్థ ను ఏర్పాటు చేసి మూగ జీవుల సంరక్షణ, వాటి హక్కుల గురించి పాటు పడుతుంది. చాలా కాలం తరువాత ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అమల నటిస్తుంది. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కానుంది. నాగర్జున, అమల కుమారుడు అఖిల్ త్వరలో హీరోగా పరిచయం కానున్నాడు. ఇలా అద్భుతమైన జీవన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న అమల సమాజ శ్రేయస్సుకు మరింత తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రవిశేష్.కాం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది. హ్యాపీ బర్త్డే అమల గారూ.. 

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vishnu hansika denikaina ready
Kareena kapoor saif ali khan marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles