Mahesh babu shankar hindi movie

mahesh babu shankar hindi movie

mahesh babu shankar hindi movie

11.gif

Posted: 09/11/2012 05:05 PM IST
Mahesh babu shankar hindi movie

       సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ అంటే కలెక్షన్ల దూకుడే. ఇక ప్రఖ్యాత తమిళ దర్శకుడు శంకర్ తీసిన చిత్రమంటే దక్షిణ భారతమంతా సుపరిచితమే. వీరిద్దరి కలయికలో మూవీ వచ్చిందంటే ఆఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని లేదు.. అందరూ థియేటర్లకుmahesh_e దారితీయాల్సిందే.. ఇప్పుడు అదే శుభతరుణం ఆసన్నమవుతుందనే సూచనలు అందుతున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ ఒక్కసారిగా కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా నిర్మించడానికి రంగం సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది తెలుగు సినిమా కాదు... హిందీ సినిమా కావడం మరో విశేషం. ప్రస్తుతం విక్రం, ఎమీ జాక్సన్ జంటగా తాను తమిళంలో రూపొందిస్తున్న'ఐ' సినిమాను మహేష్ బాబుతో హిందీలో రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నాడట శంకర్. అసలు ఈ రీమేక్ కోసం ముందుగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ని శంకర్ సంప్రదించాడట. దీనికి హృతిక్ కూడా ఓకే చెప్పినప్పటికీ, డేట్స్ సర్దుబాటు కావడం లేదట. దాంతో ఈ సినిమాని మహేష్ బాబుతో తీయాలని శంకర్ యోచిస్తునట్లు కోలీవుడ్ సమాచారం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగ్ కోసం చెన్నైలో ఉన్న మహేష్ తో దీనికి సంబంధించి శంకర్ పలుమార్లు చర్చించినట్టు చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఇక టాలీవుడ్, కోలీవుడ్ అండ్ బాలీవుడ్ హోరెత్తిపోద్దన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film production in vijayanagaram
Naga chitanya auto nagar surya update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles