Charan yevadu movie story leaked

gossip,bollywood,tollywood,kollywood,news, Telugu Film News, Telugu Film News blog, Telugu Film News bloggers, Telugu Film News articles

If the sources are to be believed, the story of Mega Power Star Ram Charan Tej’s new movie titled ‘Yevadu’ under the direction of Vamsi Paidipally was leaked. Here is the story line of Ram Charan’s Yevadu as told us by a reliable source. Please stop reading further if you feel it kills the curiosity factor.

Charan Yevadu Movie Story Leaked.png

Posted: 09/06/2012 07:53 PM IST
Charan yevadu movie story leaked

Ramchran_Arjun

టైటిల్ ని చూసి ఆశ్చర్యపోకండి... సినిమా షూటింగే పూర్తి కాలేదు... సినిమా రివ్యూ ఎలా రాశారు మీరు? అనే డౌట్లు రానీయకండి. మీరు చదువుతున్నది రామ్ చరణ్ ‘ఎవడు ’ సినిమా స్టోరీనే... తాజాగా ఇది లీకైంది. ఇందులో స్టోరీ మొత్తం కళ్ళకు కట్టినట్లు ఉంది. రివ్యూ ప్రకారం చూసుకుంటే కళాకారుల పనితీరు, సాంకేతిక వర్గం, విశ్లేషణ మాత్రమే ఇందులో లేవు. అవి సినిమా రిలీజ్ అయిన రోజు రాస్తాం. ఇప్పుడు మాత్రం ఈ స్టోరీ ని చదివి ఎంజాయ్ చేయండి...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం రూపొందబోతున్న విషయం తెలియగానే మెగా అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సమంతా, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా, ఫ్యామిలీ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స్వీయ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ మెగా అభిమానుల ఆశల పై నీళ్లు చల్లుతూ... ఈ చిత్రం స్టోరీ పూర్తిగా లీక్ అవడంతో చిత్రయూనిట్ తో పాటు, అభిమానులకు షాక్ తగిలింది.

తాజాగా ఇంటర్నెట్లో లీక్ అయిన "ఎవడు" చిత్ర కథాంశంలోకి వెళితే...చిత్రం ప్రప్రధమంగా అల్లుఅర్జున్‌తో మొదలవుతుందట. బన్నీ సరదాగా, ఆనదంగా గడిపే యువకుడు. తన లవర్ కాజల్‌తో చెట్టాపట్టాలేసుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో బన్నీ ఓ భయంకర యాక్సిడెంట్‌కు గురవుతాడు. ఈ యాక్సిడెంట్లో బన్నీ ముఖం గుర్తుపట్టలేని విధంగా దెబ్బతింటుంది. దీంతో వైద్యులు అతని ముఖాన్ని యధాస్థితికి తేవడానికి ప్లాస్టిక్ సర్జరీ తప్పనిసరని బన్నీ తల్లిగారైన సుహాసినికి తెలియజేస్తారు. సుహాసిని డాక్టర్లకు బన్నీ ఫోటోను ఇవ్వగా డాక్టర్లు ఆ ఫోటోలోని విధంగా బన్నీకి సర్జరీ పూర్తి చేస్తారు. సర్జరీ అనంతరం కట్లు మెల్లమెల్లగా తీస్తున్నతరుణంలో సుహాసిని డాక్టర్లకు ఇచ్చిన ఫోటో కనబడుతుంది.

సుహాసిని డాక్టర్లకు ఇచ్చిన ఫోటో బన్నీది కాదు రామ్ చరణ్‌ది, కట్లు విప్పాక తన ముఖాన్ని చూసుకుని షాక్‌ అయిన బన్నీ రామ్‌చరణ్ ముఖంతో అష్టకష్టాలకు గురి అవుతాడు, రామ్‌ చరణ్ ముఖంతో ఉన్న బన్నీను గుర్తించక బన్నీ లవర్ కాజల్ కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. ఇంతలో చరణ్ అంటూ మరో హీరోయిన్ ఎమీ జాక్సన్ బన్నీకు దగ్గరవుతుంది. ఆమె ఎవరో, ఆమెకు ఈ ముఖానికి సంబంధించిన వ్యక్తికున్న సంబంధం ఏమిటో, బన్నీ ధరించిన ముఖం ఏ వ్యక్తిదో, సర్జరీ సమయంలో సుహాసిని బన్నీ ఫోటోకి బదులుగా చరణ్ ఫోటోని డాక్టర్లకు ఎందుకిచ్చిందన్న ప్రశ్నలతో ఈ మిగతా చిత్ర కథాంశం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథ ఇలా ఉందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

కథ ఎలా ఉన్నా... ఇన్ని ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉన్న ఈ సినిమా స్టోరీ లీక్ అయినట్లు లేదని, సినిమా రివ్యూ లాగా ఉందని ఫిలింనగర్ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superstar appreciates sudigadu
Dhanush gets slapped by sonam kapoor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles