సీనియర్ నటుడు జగపతిబాబు తాజా సినిమాల పరంపర ఊపందుకోబోతోంది. రాంగోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఓ కొత్త దర్శకుడు ఈ యాక్షన్ మూవీకి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. దీనికి 'యుగం' అనే టైటిల్ కూడా నిర్ణయించారట. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందనీ, త్వరలో షూటింగ్ మొదలవుతుందనీ అంటున్నారు. గతంలో జగపతిబాబుతో 'గాయం-2' చిత్రాన్ని నిర్మించిన డాక్టర్ ధర్మకర్త ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. అంతేకాదు.. ఈమధ్య '3' సంఖ్య టైటిల్ గా తమిళంలో ఓ సినిమా వచ్చిన సంగతి మనకు తెలుసు. అదే కోవలో ఇప్పుడు '6' అనే నెంబర్ టైటిల్ తో తెలుగులో ఓ సినిమాని నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతోంది. జగపతిబాబు నటించే వందవ చిత్రం కోసం ఈ టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. జగపతి బాబుకి ఇది 100 చిత్రం కాబట్టి, ఆయన కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోయేలా దీనిని ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ భారీగా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ దీనికి దర్శకత్వం వహిస్తాడట.
మరో విషయం ఏమిటంటే.. గతంలో శ్రీకాంత్ కథానాయకుడుగా ప్రముఖ రచయిత పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో 'ఆపరేషన్ దుర్యోధన' పేరుతో ఓ సినిమా వచ్చిన సంగతి మనకు తెలుసు. అప్పట్లో ఆ సినిమా కాస్త వివాదాన్ని కూడా రేపింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మాణం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి కథానాయకుడుగా ఇందులో జగపతిబాబు నటిస్తాడు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలను గతంలోలా పోసాని కృష్ణ మురళి నిర్వహిస్తాడు. ఈ 'ఆపరేషన్ దుర్యోధన -2' చిత్రాన్ని నట్టి కుమార్ నిర్మిస్తున్నాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more