Samanta nani movie eto velipoindi manasu

samanta nani movie eto velipoindi manasu, dubbing samantha, audio postphone

samanta nani movie eto velipoindi manasu

7.gif

Posted: 09/03/2012 02:31 PM IST
Samanta nani movie eto velipoindi manasu

        సొంత గొంతుకతో డబ్బింగ్ చెప్పే కథానాయికల సంఖ్య తెలుగు పరిశ్రమలో పెరిగిపోతూ వుంది. సినీ ప్రియులు ఈ ట్రెండ్‌ను శుభపరిమాణంగా భావిస్తున్నారు. నిత్యమీనన్ (అలా మొదలైంది), తాప్సీ (మొగుడు)లాంటి పరభాషా భామలు ఎంచక్కా తెలుగులో సొంత గొంతుకను వినిపించి ఆకట్టుకున్నారు. ఛార్మీ ఎప్పటినుంచో తెలుగులో సొంత వాణీ వినిపిస్తోంది. తాజాగా వారి బాటలోనే చెన్నై చిన్నది yeto_vellipoyindi_manasu_eసమంతా తన తాజా చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ తమిళ వెర్షన్‌కు సొంతంగా డబ్బింగ్ చెప్పబోతోంది. ఈ ముద్దుగుమ్మకు డబ్బింగ్ కళాకారిణి చిన్మయి గాత్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్ల సినిమా కెరీర్‌లో సమంతా తన సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఆ చిత్ర తెలుగు వెర్షన్‌కు కూడా సమంతా సొంత డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో నాని కథానాయకుడిగా నటిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
       ఇదిలా ఉండగా, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్ర ఆడియో విడుదల ముందుగా (సెప్టెంబర్ 2) న విడుదల చేయాలనుకున్నారు. ఈ వేడుకలో మాస్ట్రో ఇళయరాజా అతని టీంతో కలిసి లైవ్ కచేరి చాయనున్నారని తెలిపారు. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆడియో విడుదల వాయిదా పడింది. ఈ చిత్ర తమిళ్ వర్షన్ ‘నీతానే ఎన్ పొన్వసంతం’ చిత్ర ఆడియో నిన్న చెన్నైలో అతిరథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజా లైవ్ ఆర్కెస్ట్రా చూసిన అతిదులందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagapathi babu new movies
Nayak movie ram charan kajal new look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles