పాప్ స్టైల్ లో తెలుగుపాటలు పాడే బాబా సెహగల్ తాను కూడా పవన్ అభిమానినని ... పవనిజాన్ని ఆవిష్కరించే ఓ పాటను సిద్ధం చేసి, దానిని ఆయన అభిమానులకి అంకితం చేస్తానని గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడాయన ఆ ఆల్బం సిద్ధం చేశాడు. 'పవా పవా పవా ... పవన్ కల్యాణ్, పవా .. పవా .. పవా ... పవన్ కల్యాణ్' అంటూ ఈ పాట సాగుతుందనీ, ఆయన అభిమానులను ఉర్రూతలూగిస్తుందని అంటున్నాడు. ఈ ఆల్బం ను పవన్ కల్యాణ్ జన్మదినం నాడు అంటే, రేపు సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నారు. ఆ పాటకు సంబంధించిన టీజర్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాదే...
ఇదిలా ఉండగా, తెలుగు తెరపై అగ్ర కథానాయకుడుగా వెలుగొందుతోన్న పవన్ కల్యాణ్, త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన రేపు ఈ విషయమై ఓ ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో ఆయన ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించనున్నాడనీ ... ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి చిన్న సినిమాలు మొదలు, భారీ సినిమాల వరకూ రూపొందుతాయని అంటున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త వాళ్లకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పవన్ ఉన్నాడనీ ... అలాగే తన దర్శకత్వంలో కొన్ని సినిమాలను తెరకెక్కించాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడని చెబుతున్నారు. భవిష్యత్తులో రాజకీయాల వైపు వెళ్లే ఆలోచన లేకపోవడంతో, సినిమా నిర్మాణ రంగంలో స్థిరపడాలనే ముందుచూపుతోనే పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. ఇక ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే అధికారికంగా ఓ ప్రకటన వెలువడవలసిందే.
కాగా, పవన్ కల్యాణ్, పూరి కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ రోజు నుండి ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమలు ప్రారంభమయ్యాయి. కాగా, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆడియో విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 15 న ఆడియో వేడుకను చేయటానికి ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ సమాచారం. మణిశర్మ ఈ సినిమా కోసం జనరంజకమైన బాణీలు సిద్దం చేశాడని అంటున్నారు. ఈ చిత్రం లో మిల్కీ వైట్ భామ తమన్నా పవన్ సరసన నటిస్తోంది. ఈ చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య సినిమాని అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more