Teluguwisheshcom birthday wish pawan kalyan

teluguwishesh.com birthday wish pawan kalyan , gabbarsingh, cameramen gangato rambabu, jalsa,

teluguwishesh.com birthday wish pawan kalyan

3.gif

Posted: 09/02/2012 01:28 PM IST
Teluguwisheshcom birthday wish pawan kalyan

pawan_f       తెలుగు చిత్ర సీమ పరిఢవిల్లే రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసే సత్తా... పదేళ్లు ఒక్క హిట్టు లేకపోయినా తన పవర్ తో సునామీ సృష్టించగల అద్భుతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్..  ఏ మాత్రం తగ్గని పవర్... చిత్ర సీమలో కొందరికి సాక్షాత్తూ భగవంతుడు.. కొందరికైతే.. అమ్మా.. నాన్నా.. తర్వత పవన్ కళ్యాణే... గబ్బర్ సింగ్ తో కలెక్షన్ల సునామీ సృష్టించి.. కెమెరామెన్ గంగతో రాంబాబుగా రాబోతోన్న  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రవిశేష్.కాం అందిస్తోన్న స్పెషల్ స్టోరీ..

pawan_3
     మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి పవర్‌ఫుల్‌ హీరోగా మారిన స్టార్ హీరో.. తెలుగు చిత్ర సీమకి చిరంజీవి తమ్ముడిగా కొణిదల కల్యాణ్ బాబు  'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' చిత్రంతో పరిచయం అయ్యాడు.  తన పేరులో 'పవన్' పదాన్ని చేర్చుకుని, వాయువేగంతో రెండవ చిత్రానికే 'గోకులంలో సీత' అంటూ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకున్నాడు. 'సుస్వాగతం', 'తొలిప్రేమ' వంటి వినూత్న ప్రేమ కథలను ఎంచుకోవడంతో వరుస విజయాలను అందుకుని, 'యూత్' కి అభిమాన పాత్రుడైపోయాడు. కుర్రాళ్ళు కోరుకునే యూత్ సబ్జెక్ట్ తో  'తమ్ముడు', 'బద్రి' లాంటి సినిమాలు చేసి, ప్రతి ప్రేక్షకుడు తన సినిమా కోసం ఎదురు చూసేలా చేసాడు.  తన నటనలో, ఫైట్స్ లో, డైలాగ్ చెప్పటంలో.. ఇలా ఒకటేమిటి ప్రతి అంశంలో పవన్ కల్యాణ్ తన బ్రాండు కొత్తదనాన్ని ఆవిష్కరించాడు.

pawan_11
       ఆ తరువాత వచ్చిన 'ఖుషి' సినిమా యువతని మాయ చేసేసి, పవన్ మేనియాలోకి నెట్టేసింది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా,  సమాజంపై తనకున్న బాధ్యత తెలియజేస్తూ, తన ప్రతి సినిమాలో సామాజిక దృక్పథంతో కూడిన ఒక గీతాన్ని ఉండేలా చూసుకున్నాడు. అయితే, వరుస విజయాలతో దూసుకుపోయిన పవన్ కు కూడా ఒకసారి బ్రేక్ పడింది. కొన్ని సినిమాలు ఆశించిన మేర ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దాంతో, తన నుండి అభిమానులు ఏం ఆశిస్తున్నారో అవి ఉండేలా 'జల్సా' చేశాడు. అది భారీ విజయాన్నిచ్చింది. సినిమా సినిమాకు సరికొత్త లుక్ లో కనిపించాలని ఫిక్స్ అయిన పవర్ స్టార్ గత ఏడాది పంజా, తీన్ మార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాపీసు వద్ద అద్భుతలేవి చూపించకపోయినా తన యాక్టింగ్ తో ఫ్యాన్స్ ను అలరించాడు పవన్. సినిమాలో ఏదో కొత్తదనాన్ని చూపించడం కూడా ఈ పవర్‌స్టార్‌కు అలవాటే.

pawan_4fffeee
      జల్సాలో ఛేగువేరా ఫొటో బాక్ గ్రౌండ్ లో సాంగ్ చెయ్యడం పవన్ స్టైల్ కు ప్రతీక. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో పవన్‌ పెర్ఫామెన్స్‌ నిజంగా అదుర్సే. లవ్‌, యాక్షన్‌, ఫైట్స్‌, కామెడీ, మ్యూజిక్‌ ఇవన్నీ సినిమాలో కీ ఎలిమెంట్స్‌. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ పర్ఫెక్ట్‌గా సెట్టయితేనే మూవీ హిట్టయ్యేది. వీటన్నింటిని తనదైన స్టయిల్లో చేయడం పవర్‌స్టార్‌ స్పెషాలిటీ. సినిమా ఏదైనా క్యారెక్టర్‌ ఎలాంటిదైనా దాన్ని ఆడియెన్స్‌ మెచ్చేలా చేయడం పవన్‌ స్టైల్‌.

pawan_6
    అయితే.. 'పులి', 'తీన్ మార్', 'పంజా' చిత్రాలు నిరాశ పరిచాయి. అంతే... ఆ తర్వాత మళ్లీ గాడిలో పడ్డాడు. 'గబ్బర్ సింగ్' తో బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాసి, తన పూర్వ వైభవం సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించాలని తపన పడే పవన్, ఇప్పుడు సంత్సరానికి రెండు, మూడు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. పవన్‌కు దేశభక్తి ఫీలింగ్‌ కాస్త ఎక్కువనే చెప్పాలి. దేశభక్తే కాదు.. సామ్రాజ్యవాదం.. దోపిడి.. భారతమాత.. పవన్ కళ్యాణ్ కే సాధ్యమైన విజువల్ ప్రజంటేషన్.. తెలుగు సినిమాలో ఫుల్ లెన్త్ హిందీ సాంగ్ పెట్టడం కూడా అలాంటి సాహసమే.

pawan_2
       పదిహేనేళ్ళు.. పదిహేడు సినిమాలు.. అయితేనేం.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్. సినిమా ఎలా ఉన్నా ఫ్యాన్స్ ఫుల్ గా ఖుషి చేయడం పవన్ కే సాధ్యం. ఇటీవల వరుస సినిమాలతో స్పీడ్ పెంచిన పవన్.. తాజాగా పూరీ డైరెక్షన్ లో కెమెరామెన్ గంగతో రాంబాబుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమవుతోంది.

pawan_7.1

       అసలు విషయం ఏమిటంటే... ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా పండుగ జరుపుకుంటున్నారు. దాదాపు రాష్ట్రంలోని ప్రతి ఊరిలో కేక్స్ కట్ చేసి తన అభిమాన పవన్ కు శుభాకాంక్షలు పంపుతున్నారు. ఇక సోషల్ నెట్ వర్క్స్ లో అయితే చెప్పనక్కర్లేదు.. మహిళలు యువతులు, టీనేజ్ అమ్మాయిలు, కూడా పవర్ స్టార్ పుట్టిన రోజుని ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తుండటం విశేషం.. మొత్తానికి ఆయన సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా.. ఏ మాత్రం పవర్ తగ్గని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు. ఎగైన్... హ్యాపీ బర్త్డే పవర్ స్టార్...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cemeramen ganga to rambabu teaser
Power song by baba sehgal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles