Hero rana overseas market

hero rana overseas market

hero rana overseas market

3.gif

Posted: 08/27/2012 03:08 PM IST
Hero rana overseas market

       యంగ్ హీరో రానా కు అతని సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.   క్రిష్ దర్శకత్వంలో రానా krishnamహీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఈ చిత్రం యు.ఎస్.ఎ రైట్స్ 90 లక్షలకు అమ్ముడు పోయాయి. రానా కెరీర్లో ఇంత పెద్ద మొత్తానికి హక్కులు అమ్ముడు పోవడం ఇదే మొదటిసారి. ‘గమ్యం’ ‘వేదం’ చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించటం, దీనికి తోడు నయనతార హీరోయిన్ గా ఉండటం అమెరికా మార్కెట్ లో ఇంతరేటు రావటానికి కారణంగా చెప్పవచ్చు. ఈ చిత్రం తమిళ వెర్షన్ 'ఓంగారం' కూడా కోలీవుడ్ మార్కెట్లో హాట్ ప్రాపర్టీగా వుంది! కాగా, భారీ యాక్షన్ సన్నివేశాలతో పూర్తి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జాగర్లమూడి సాయి నిర్మిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకూ టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ సరైన కమర్షియల్ హిట్ లేని రానాకి ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఎంతో కీలకంగా మారింది. ఈ చిత్ర మైనా రానాకు విజయాన్ని అందిస్తుందో లేదో..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh dookudu in malayalam
Hero balakrishna about ntr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles