Veteran actress sita daughter turns director

veteran actress sita daughter turns director

veteran actress sita daughter turns director

26.gif

Posted: 08/20/2012 07:51 PM IST
Veteran actress sita daughter turns director

      Keertana_9795 ఒకప్పుడు సాంప్రదాయ బద్దంగా తన పాత్రల్లో ఒదిగిపోయిన సీత కూతురు దర్శకురాలవుతోంది.  మణిరత్నం దర్శక ప్రతిభకి అద్దం పట్టిన సినిమాలలో ఒకటైన 'అమృత' లో ఆమె నటించింది. అంతేకాదు బాలనటిగా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ అమ్మాయే కీర్తన. బాల్యంలోనే అంతటి ప్రతిభాపాటవాలు కనబరిచిన ఈ అమ్మాయి గురించి ఇంకా విఫులంగా చెప్పాలంటే..  నిన్నటి తరం కథానాయిక సీత గారాలపట్టి ఈ చిన్నది. తెలుగులో 'ముత్యమంత ముద్దు' ... 'పోలీసు భార్య' ... 'ఆడదే ఆధారం' వంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించి మెప్పించిన సీత, ఆ తరువాత తమిళ నటుడు పార్తీబన్ ను వివాహమాడి తెలుగు తెరకు దూరమైంది. తల్లిదండ్రులు నటనకి సంబంధించిన విషయంలో రాణిస్తే, కీర్తన మాత్రం దర్శకత్వంపై దృష్టి పెడుతూ వచ్చింది.      sita_innఓ వైపున దర్శకత్వంపై ఆసక్తిని పెంచుకుంటూనే, మరో వైపున ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ స్కూల్లో శిక్షణ పొందుతూ వచ్చింది. ప్రస్తుతం అజిత్ హీరోగా విష్ణు వర్ధన్ తెరకెక్కిస్తోన్న సినిమాకి కీర్తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. త్వరలోనే దర్శకురాలిగా తన సత్తా చాటడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపున హీరోల కూతుళ్లు ... మరో వైపున హీరోయిన్ల కూతుళ్లు కథానాయికలు కావడానికి పరితపిస్తుంటే, వాళ్లిద్దరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కీర్తన మాత్రం దర్శకత్వాన్ని ఎంచుకోవడం విశేషమే కదా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamuri taraka ratna new movie
Ram charan nayak movie shooting in grees  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles