Srihari birthday special

srihari birthday special

srihari birthday special

1.gif

Posted: 08/16/2012 01:47 PM IST
Srihari birthday special

      Srihari-Birthday రియల్ స్టార్ శ్రీహరికి సినీ అభిమానులే కాదు, నిజజీవితంలోనూ ఎంతో మంది ఆప్ర్యాయతను పంచేవారున్నారు. అదంతా అతని మంచితనమే అని టాలీవుడ్ లో నానుడి. ప్రతీ ఏడాది అభిమానుల మధ్య ఎంతో సంబరంగా జురుపుకుంటారు శ్రీహరి తన పుట్టిన రోజు వేడుకను. అయితే నిన్న జరిగిన అతని బర్త్డేకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది పుట్టిన రోజు స్పెషాలిటీ ఏమంటే, శ్రీహరి మనోభావాలు పూర్తిస్థాయిలో పొంగుకొచ్చిన పుట్టిన రోజుదికావటం దీని ప్రత్యేకం. ఆ వివరాలేంటో ఆయనమాటల్లోనే.. ‘‘చూస్తుండగానే ఇండ్రస్టీలో అడుగుపెట్టి 26 సంవత్సరాలు పూర్తయ్యాయి. నాకే వండర్‌ అనిపిస్తుంది. ప్రేక్షకాభిమానులు ఇంకో 20 ఏళ్ళు నన్ను అప్యాయంగా భరించాలి. నటుడిగా పరిణితి వచ్చిందిప్పుడు. ఇప్పుడు ప్రతి పాత్రలో పెర్ఫెక్షన్‌ కోసం ప్రయత్నిస్తున్నా. మరో 20ఏళ్ళు నటించే స్టామినా ఉంది. అలాగే పరిశ్రమకి కొందరి అవసరం ఉంది. వారుంటేనే మనగలుగుతుంది. ఆ జోన్‌లో నేనున్నానని భావిస్తున్నాను. పలానా వేషం శ్రీహరి మాత్రమే చేయగలడు అనే స్థాయికి చేరుకున్నాను. అదే srihari_3eeఅవకాశాల్నిస్తుందిక్కడ. మగధీర చిత్రం తరువాత ఫాలోయింగ్‌ బాగా పెరిగింది. ఈ ఏడాది నేను చేసిన అన్ని సినిమాలు నన్ను తృప్తిపరిచాయి. 'శిరిడిసాయి'లో బాబాని తొలిసారి ఫొటో తీసిన ఆంగ్లేయునిగా, శంకరాచార్యలో గురువుగారిగా, యమహోయమలో యముడిగా ఇంకా ఎన్నో వైవిద్యమైన పాత్రల్లో కనిపిస్తాను. దాదాపు 10 సినిమాలు నటిస్తున్నాను. దర్శకుడిగా పరిచయం కాబోతున్న సినీ జర్నలిస్ట్‌ నాగు గవర దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. కార్పొరేట్‌ కంపెనీల్లో పని చేసే యువత ఎలా ఉన్నారనే దానిపై అద్భుత మైన స్క్రిప్ట్‌ తయారు చేశాడు నాగు. ఫాస్ట్‌ జనరేషన్‌ గురించి ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. స్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం కూడా ప్రారంభమవుతుంది.
       మా ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షర ఫౌండేషన్‌ సేవలకు గానూ, మూడు నెలల క్రితం మేము నిర్వహించిన స్కైలాంతర్‌ కార్యక్రమానికి గానూ గిన్నీస్‌బుక్‌ రికార్డ్‌ నుంచి సర్టి ఫికెట్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. (దాదాపు 11800 స్కై లాంతర్‌లను విడుదల చేశాము.) నా దర్శకత్వంలో 'డీ గ్యాంగ్‌' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తాను. ఈచిత్రానికి నేనే రచయితని, దావూద్‌ని దేవుడిని చేస్తే..? అతడితో మంచి పనులు చేయిస్తే..? ఎలా ఉంటుందనేది కథ. 10 మంది హీరోలు నటించబోతున్నారీ చిత్రంలో. త్వరలోనే ప్రారంభిస్తాం. సంక్రాంతికి srihariవిడుదల చేస్తాం. అలాగే పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో ఓ కథ తయారవుతుంది. అరటి ఆకులు, మామిడి తోరణాలు, ఆసుపత్రి, జిమ్ము, బైబ్రరీ...ఇన్ని సదుపాయాలున్న ఓ పెద్ద లోగిలిలో ఉండే పోలీస్‌స్టేషన్‌ అది. సామాన్యులకు అండగానిలిచేలా, దేనికైనా అక్కడికే వెళ్లేలా ఆదర్శంగా ఉండేలా చూపించాలన్నదే నా ఆశ. అక్కడికి వేళ్లే బాధితులకు అభయం తప్ప భయమే వుండని స్టేషన్‌ అన్న మాట’’.అన్నారు రియల్ స్టార్ శ్రీహరి. 
         ఆయన స్వగృహమునందు వైభవంగా జరుపున్న పుట్టిన రోజు వేడుకలో నటుడు జీవా, ఆర్‌ నారాయణమూర్తి, అభిమానులు ఈ వేడకలో పాల్గొని శ్రీహరికి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయరంగంలోనూ అడుగిడి అడుగిడి ప్రజలకు మరింత మేలు చేయాలని ఆలోచనలో ఉన్న శ్రీహరికి శుభాకాంక్షలు తెలుపుతోంది ఆంధ్రావిశేష్.కాం

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vereran hero suresh challenge for balakrishna
Chiru guest appearence in charan movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles