Banny trivikram movie julayi release today

banny trivikram movie julayi release today

banny trivikram movie julayi release today

6.gif

Posted: 08/09/2012 02:07 PM IST
Banny trivikram movie julayi release today

      ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మొదలు.. మూవీ మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయిన బన్నీ – త్రివిక్రమ్ ల ‘జులాయి’ ఈ ఉదయం భారీ ఎత్తున రిలీజ్ అయింది. మన రాష్ట్రంలోనేకాదు పొరుగు రాష్ట్రాలోనూ బన్నీ ఫ్యాన్స్ ఈ చిత్రం రిలీజ్ అయిన థియేటర్లను భారీ కటౌట్లతో నింపేశారు. ప్రతీ థియేటర్ వద్ద భారీ గా క్రౌడ్ ఈ తెల్లవారుఝామునుంచే కనిపించింది. ఇక ఈ చిత్రంలోని మంచి చెడులు ఎలా ఉన్నాయనే దానికి ముందు ఆంధ్రావిశేష్.కాం చిత్ర కథనం నడిచిన తీరును విజిటర్స్ కు అందిస్తుంది. julayi_release_today_poster

       సినిమా ఆరంభంలో కోట, తనికెళ్ళ భరణి సోనూ సూద్ లను పరిచయం చేశారు త్రివిక్రమ్. అతని మార్క్ పంచ్ డైలాగ్స్ తో మూవీ మొదలైంది.. ‘‘లైఫ్ అయింది హైవే.. గెలుపె అయింది ఒన్ వే.. షార్ట్ కట్స్ కి నోవే...’’ తనికెళ్ళ భరణి కొడుకుగా అల్లు అర్జున్ చాలా కూల్ గా ఎంట్రీ ఇచ్చారు.. రావు రమేష్ తో కలిసి పోసాని మురళీ కృష్ణ కథలోకి ప్రవేశించారు. అనంతరం రోబరీ సన్నివేశం. బన్నీ ఇంట్రడక్షన్ సాంగ్ మొదలైంది. పాటలో అల్లు అర్జున్ డాన్సు కేక. పాటలో చాలా హాట్ గా ఉదయభాను ఎంట్రీ ఇచ్చింది. ఎ.సి.పి సీతారం గా రాజేంద్ర ప్రసాద్ కథలోకి ప్రవేశించారు. సూపర్బ్ ఎంట్రీ తో బ్రహ్మానందం కథలోకి ఎంట్రన్స్.... చాలా సింపుల్ గా ఇలియానా ఎంట్రీ. ఎం ఎస్ నారాయణ సి.ఐ వాల్మీకి గా అరంగేట్రం, అలాగే ధర్మవరపు సుబ్రమణ్యం కూడా ఎంట్రీ ఇచ్చారు.

     అల్లు అర్జున్ మరియు ఇలియానా ల మధ్య 'ఓ మధు' అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్. ఈ పాటలోనూ అల్లు అర్జున్ మంచి స్టెప్పులు వేశాడు. ట్రావెల్ మూర్తి గా బ్రహ్మాజీ ప్రేక్షకులకు బాగా నవ్వులు పంచాడు.' హేయ్ చక్కాని బైక్ ఉంది' అనే పాట. అల్లు అర్జున్ మరియు ఇలియానాల మధ్య కూల్ గా రొమాంటిక్ ట్రాక్. కార్ చేజ్ ,ఫైట్ ని చాలా బాగా తీసారు. సోనూ సూద్ మరియు అల్లు అర్జున్ మధ్య తీసిన ఈ సన్నివేశాలతో మొదటి అర్ధభాగం ముగిసింది.

       మంచి డైలాగ్స్ మరియు మంచి కామెడీ తో మొదటి అర్ధ భాగం చాలా బావుంది. ఇక ప్రస్తుతం సినిమా రివెంజ్ స్టోరీగా మలుపు తిరిగింది. సీతారామ్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ సీరియస్ లుక్. వెన్నెల కిషోర్ కథలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 'లవ లవ' సాంగ్. ఈ పాటని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈ పాటలో అలీ అలా వచ్చి వెళ్ళిపోయారు. తర్వాత 'మీ ఇంటికి ముందో గేటు' అనే పాట. ఈ పాటలో సీనియర్ ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్ మరియు పవన్ కళ్యాణ్ లని బన్ని చాలా బాగా ఇమిటేట్ చేశాడు. బ్రహ్మానందం సన్నివేశాలు చాలా నవ్వులు పండించాయి. స్టోరీలో కీలక మలుపు. సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది. అల్లు అర్జున్ మరియు సోనూ సూద్ ల మధ్య వచ్చే క్లైమాక్స్ ఫైట్ ని బాగా చిత్రీకరించారు. అనంతరం ఫన్నీ డైలాగ్స్ మురిపించాయి. సినిమా సమాప్తం.. త్వరలోనే పూర్తిస్థాయి రివ్యూ అందిస్తాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Julayi dialogues
Happy birthday to prince mahesh babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles