Allari naresh latest socio fantacy movie

allari naresh latest socio fantacy movie

allari naresh latest socio fantacy movie

1.gif

Posted: 08/01/2012 01:52 PM IST
Allari naresh latest socio fantacy movie

        'అల్లరి'నరేష్‌, రిచాపనయ్‌ జంటగా ఫ్రెండ్లీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం షెడ్యూల్‌ నిన్నటితో allari_innereeపూర్తయింది. ఇ.సత్తిబాబు దర్శకుడు. ఈ చిత్రం కోసం రామోజీ ఫిలింసిటీలో స్టంట్‌ మాస్టర్‌ గణష్‌ సారథ్యంలో కొన్ని ఫైట్‌ సన్నివేశాలను మంగళవారం వరకు చిత్రీకరించారు. ఈ విషయాన్ని నిర్మాత చంటి అడ్డాల తెలియజేసారు.  ఈ చిత్రం కోసం యముడి ఇంటిసెట్‌, దర్బార్‌ సెట్‌, బృందావనం వంటి 11 సెట్స్‌ నిర్మించి, వాటిలో షూటింగ్‌ చేశామని తెలిపారు. ప్రస్తుతం జరిగిన షెడ్యూల్‌తో సెట్స్‌ చిత్రీకరణ మొత్తం పూర్తయిందని చెప్పారు.
       ఆగస్టు 10 నుంచి పాలకొల్లు, ఆ పరిసరాల్లో తాజా షెడ్యూల్‌ను మొదలుపెడతామని అన్నారు. అందులో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడంతో పాటు గోదావరి ఐలాండ్‌లో ఓ సెట్‌ను నిర్మించి, అందులో ఓ పాటను చిత్రీకరిస్తామని ఆయన వివరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఓ పాటను, విదేశాల్లో మరో పాటను తియ్యడంతో షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుందని ఆయన చెప్పారు. దర్శకుడు సత్తిబాబు మాట్లాడుతూ, అద్భుతమైన సెట్స్‌తో పాటు గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. కోటి అద్భుతమైన బాణీలను అందించారని, ఆయన స్వరపరిచిన ఐదు పాటలు సంగీత ప్రియులను అలరింపజేస్తాయని చెప్పారు. నరేష్‌తో పాటు తమకందరికీ ఇది ఓ విభిన్న చిత్రమవుతుందని అన్నారు. యముడిగా షియాజీషిండే, అతని భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నారని ఆయన తెలిపారు.
       ఇంకా, చిత్రంలోని ఇతర పాత్రలలో సుమన్‌, నరేష్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,ఎం.ఎస్‌.నారాయణ, చలపతిరావు, తదితరులు నటిస్తున్నారు. సంగీతం: కోటి, ఛాయాగ్రహణం: కె.రవీంద్రబాబు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishnudu latest movie na style nade
Smitha patil award for deepika padukune  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles