Nikhil and colours swathi movie starts today

nikhil and colours swathi movie starts today

nikhil and colours swathi movie starts today

10.gif

Posted: 07/16/2012 05:44 PM IST
Nikhil and colours swathi movie starts today

      యంగ్ హీరో నిఖిల్-కలర్స్ స్వాతి జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వీరిద్దరు నాయకానాయికలుగా లక్షీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ nikhil_eపతాకంపై సుధీర్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ‘స్వామి రా..రా..’ చిత్రం ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
      ఈ సందర్భంగా నిర్మాత చక్రవర్తి మాట్లాడుతూ ‘మా సంస్థ తొలి ప్రయత్నంగా నిఖిల్ హీరోగా నిర్మించిన ‘వీడు తేడా’ చక్కటి ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజా చిత్రాన్ని కూడా నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌లోని సుందరమైన లొకేషన్లలో తెరకెక్కించబోతున్నాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి మా సంస్థకు మంచి పేరు తెస్తుందన్న నమ్మకముంది’ అన్నారు.
      రవిబాబు, జీవా, పూజ, ప్రవీణ్, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: సన్ని, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: కృష్ణచైతన్య, ఆర్ట్: నాగేంద్ర, సహనిర్మాత: సందీప్ కొరటాల, నిర్మాత: చక్రి చిగురుపాటి, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena kapoors latest pic heroine
Siridi sai audio release on 30th of this month  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles