దక్షిణ భారతాన అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ తదుపరి మూవీ “ఐ” సెట్స్ పైకి వెళ్లింది. తెలుగు, తమిళ చిత్రసీమ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ మూవీ చెన్నైలో లాంచనంగా ప్రారంభమైంది.సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈ సందర్భంలో విడుదల చేశారు. స్నేహితుడు సినిమా ఆశించిన విజయం అందివ్వని నేపథ్యంలో శంకర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని సమాచారం. ఇంతకు ముందు శంకర్-విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అపరిచితుడు సూపర్ డూపర్ హిట్ కావటంతో ఈ తాజా చిత్రం మీదా భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ ఒక కీలక పాత్ర పోషించనుంది. ఈమూవీలో విక్రమ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. విశేషమేమిటంటే, రెండు పాత్రల మధ్యా బాడీ విషయంలో వైవిధ్యాన్ని బాగా చూపిస్తున్నారట. ఒక పాత్రలో విక్రమ్ సన్నగాను, మరో పాత్రలో లావుగాను కనపడతాడు. దీంతో ముందుగా సన్నగా వున్న పాత్రకు సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తారట. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని విక్రమ్ బరువు పెరిగాక, దానికి సంబంధించిన సన్నివేశాల భాగాన్ని షూట్ చేసేలా ప్లాన్ చేశారు. తన బాడీలో చిత్రానికి తగిన మార్పులు తెచ్చుకోవడానికి శంకర్, విక్రమ్ కి మూడు నెలల సమయం ఇచ్చారని సమాచారం. ఈ సినిమా గురించి అమీ ట్వీటిచ్చింది. ‘ఐ’ మూవీ తన కెరీర్లోనే భారీ చిత్రమని తెలిపింది. ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిసున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more