Akkineni akhil entry as a hero

akkineni akhil entry as a hero

akkineni akhil entry as a hero

5.gif

Posted: 07/12/2012 04:13 PM IST
Akkineni akhil entry as a hero

      అక్కినేని కటుంభం నుంచి మరో హీరో తెరపై కదలాడనున్నాడు.  17 ఏళ్ళ క్రితం 'సిసింద్రి' సినిమాలో తన చేష్టలతో అలరించిన akil_inనాగార్జున తనయుడు అఖిల్ ఇప్పుడు హీరోగా కనిపించబోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనే తనయుడ్ని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడు నాగార్జున. ఈగతో మరో సూపర్ హిట్ కొట్టిన రాజమౌళి అయితేనే అఖిల్ సినీ ఎంట్రీ అదిరిపోతుందని నాగ్ భావిస్తున్నాడు. మొదటి కుమారుడు నాగచైతన్య విషయంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ఫ్లాప్ లేని దర్శకుడుగా ఇండస్ట్రీలో వెలుగొందుతున్న రాజమౌళి ని ఈ సినిమాకి ఎంచుకున్నారని అనుకుంటున్నారు.     ఇదిలా ఉండగా,  అఖిల్ సినిమా కోసం ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయని సమాచారం. ఓ మంచి లవ్ స్టోరీని సిద్ధం చేశారని తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సొంత బ్యానర్ లోనే తీయాలని నాగార్జున అనుకుంటున్నాడు. తాను ఏ సినిమాకి దర్శకత్వం వహించినా ఆ సినిమాలో తన రాజముద్రను గర్వంగా వేసుకోగలిగిన దర్శకుడు రాజమౌళి ఒక్కడే. ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ రాజమౌళిదే.  రాజమౌళి తో సినిమా చేయాలని టాలీవుడ్ హీరోలందరూ తహతహలాడుతుంటారు. ఇప్పుడు నాగార్జున కూడా తనయుడు అఖిల్ ను రాజమౌళి చేతిలో పెట్టాలని ఫిక్స్ అయ్యాడు.
      చిరంజీవి వంటి పెద్ద హీరోను డైరెక్ట్ చేసేందుకు జంకుతోన్న రాజమౌళి చిన్న హీరోలతో సినిమాలు తీసేందుకు ఇష్టపడతానని నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameramen ganga to rambabu story line
Vikram anushka sivatamdavam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles