Mani sharma birthday

mani sharma birthday

mani sharma birthday

25.gif

Posted: 07/11/2012 07:53 PM IST
Mani sharma birthday

      ఆయన సుప్రసిద్ద సంగీత దర్శకులు... దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకుల్ని సంగీతంతో అలరిస్తున్న మెలోడీ బ్రహ్మ. ఆయనే మణిశర్మ. ఇవాళ ఆయ్న పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర సీమ లోని పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటానికి రావటంతో మణి ఇంటవద్ద సందడి వాతావరణం నెలకొంది. మణి 1964 జూలై 11న కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు. సినీ ప్రస్థానం మొదలు పెట్టిన మొదట్లో రాజ్-కోటి, ఎం.ఎం కీరవాణి, ‘మాస్ట్రో’ ఇళయరాజాల దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా పని చేశారు. ఆ తర్వాత 1998లోmani_sharma రామ్ గోపాల్ వర్మ తీసిన ‘రాత్రి’ మరియు ‘అంతం’ సినిమాతో నేపధ్య సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏ.వి.ఎస్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్ హీరోస్’ చిత్రంతో సంగీత దర్శకుడయ్యారు. చిరంజీవి హీరోగా నటించిన ‘బావగారూ బాగున్నారా’ చిత్రంతో మణిశర్మకి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలకు ఎన్నో హిట్ సినిమాల సంగీతాన్ని అందించారు. అందులో ముఖ్యంగా ‘చూడాలని ఉంది’, ‘ప్రేమించుకుందాం రా’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’,'ఇంద్ర’, ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘ఖుషి’, ‘ చిరుత’, ‘పరుగు’, ‘తీన్ మార్’ మరియు ‘రచ్చ’ లాంటి ఎన్నో చిత్రాలకు చక్కటి సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకు మణిశర్మ 140 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించారు. మణిశర్మ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం మరియు హిందీ భాషల్లో కూడా సంగీతం అందిచారు. ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. మణిశర్మకు ఆంధ్రావిశేష్.కాం హ్యాపీ బర్త్ డే విషస్ చెబుతోంది...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cemeramen gaga to ram first look
Julayi on august 9th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles