Lakshmi prasanna treat for gaddar

lakshmi prasanna treat for gaddar

lakshmi prasanna treat for gaddar

20.gif

Posted: 07/05/2012 08:46 PM IST
Lakshmi prasanna treat for gaddar

     3.1 నారూటే... సపరేటు అనే విలక్షణ నటుడు మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న రూటుకూడా వేరే.. అందరు నడిచే దారిలోనే కాకుండా కొత్త పుంతలు సైతం ఈ అమ్మడు తొక్కగలదు.  అన్ని వర్గాల వారితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఎవరైనా సరే ఒక్కసారి ఆమెకు పరిచయమైతే... ఇక ఆమెను తమ ఇంట్లో అమ్మాయిలా ఫీలవుతారు. అంతలా అందరితోనూ తను కలిసిపోతుంది. ప్రజాగాయకుడు గద్దర్ తో ఆమెకు మంచి స్నేహం వుంది. ఆమె సమైక్యాంధ్రను సమర్ధించినా... గద్దర్ తెలంగాణా వాది అయినా... ఇద్దరూ మంచి స్నేహితులే.
       ఈ రోజు గద్దర్ అంకుల్ని తన ఇంటికి ఆహ్వానించి ఆతిధ్యాన్ని ఇచ్చింది. ఆయనతో మాట్లాడడం light-crop_8442ఎప్పుడూ తనకి ప్రీతిపాత్రమనీ, తెలంగాణా గురించి ఆయన ఎంతో చెప్పారనీ లక్ష్మి అంటోంది. ఇదిలా ఉండగా, మంచు లక్ష్మి నిర్మిస్తున్న 'గుండెల్లో గోదారి' సినిమా విషయంలో కూడా ఆ చిత్ర కెమెరామేన్ పళని కుమార్ ఇలాగే తన టాలెంట్ చూపించి 'ఔరా అనిపించుకున్నాడు. కథ ప్రకారం మత్స్యకార కుటుంబాలతో నిండిన ఓ గ్రామంలో రాత్రిపూట గోదారికి వరదలు వచ్చి, జనం కొట్టుకుపోయే దృశ్యాలను చిత్రీకరించాల్సి వచ్చింది. ఆర్టిస్టులతో బాటు, సాంకేతిక నిపుణులు కూడా నీళ్ళల్లోనే ఉంటూ రాత్రి పూట వీటిని చిత్రీకరించడం కష్టమని తేలడంతో, కెమెరామేన్ బెలూన్ లైటింగ్ ఐడియా వేశాడట. ఈ బెలూన్ లైటింగ్ తో నైట్ ఎఫెక్ట్ వచ్చేలా నిక్షేపంగా పగటి పూటే షూటింగు చేయచ్చన్నమాట. కెమెరామేన్ పళని కుమార్ ఈ బెలూన్ లైటింగ్ తో ఈ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించాడని అంటున్నారు. తెలుగు సినిమాలకు సంబంధించి ఈ తరహా లైటింగ్ వాడడం ఇదే ప్రధమమట. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ గ్రామం వద్ద 27 ఎకరాల విస్తీర్ణంలో... 120 గుడిసెలతో...  ఈ గ్రామం సెట్ ను అత్యంత సహజంగా ఎరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అంతేకాదు ఈ కొత్త ఐడియాకు పూర్తిగా ఊతమిచ్చి చేయించింది కూడా లక్ష్మీ ప్రసన్నేనట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raja mouli eega movie story and screen play
Puri jagannath films progress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles