Raja mouli eega movie story and screen play

raja mouli eega movie story and screen play

raja mouli eega movie story and screen play

1.gif

Posted: 07/06/2012 12:59 PM IST
Raja mouli eega movie story and screen play

      eega_inn ‘మగధీర’ సినిమాతో ఆధునిక తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఈగ’. ఈ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజై కొద్ది సేపటిక్రితం తెరలను తాకింది. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్ ప్రేక్షకుల ఈలలు, అరుపులతో మారుమోగిపోయింది. అంతగా ఈగ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు ప్రతీ పాత్రను రాజమౌళి అద్భుతంగా సాక్షాత్కరించాడు. సినిమా చూసి వచ్చిన వెంటనే చిత్రంలోని విశేషాలు మీతో పంచుకోవాలన్న కూతూహలం రేగింది. 1e
      అందుకే రివ్యూ కంటే ముందుగా ‘ఈగ’ సినిమా తెరకెక్కిన తీరు, కథనం నడిచిన విధానం మీకోసం అందిస్తున్నాం... మూవీ ఆరంభంలోనే చాలా స్టైలిష్ ఎంట్రీతో సుదీప్ కథలోకి ప్రవేశిస్తాడు. అనంతరం ఒక ఆర్టిస్ట్ పాత్రలో సమంత చాలా క్యూట్ లుక్ తో ఎంట్రీ ఇచ్చింది. 'నేనే నానినే' అనే పాటతో నాని కథలోకి వచ్చాడు. హీరో నాని తన కామెడితో ప్రేక్షకులను నవ్వించటంతో పాటు మరోవైపున మంచి రొమాంటిక్ ట్రాక్ నడుపుతుంటాడు. బిందు(సమంత) కోసం నాని సుదీప్  మధ్య వైరుధ్యం పెరుగుతుంది. నెగటివ్ పాత్రలో సుదీప్ సూపర్ గా నటించాడు. విలన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన హీరో " ఈగ" గా అవతరించాడు. కీరవాణి  నేపధ్య సంగీతం ఆకట్టుకునే విధంగా సాగింది. ఒక్కో సన్నివేశంలో విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ఔరా అనిపిస్తున్నాయి. ఈగ చాలా తెలివైన స్కీమ్స్ తో సుదీప్ లైఫ్ ని బీభత్సంగా డిస్టర్బ్ చేస్తోంది.. ఈ సన్నివేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి.. ఇప్పుడు సినిమాలో బ్రేక్...
      1eeffమొదటి అర్ధ భాగం చాలా సుపర్బ్ గా ఉంది. మంచి ఉత్సాహకరమైన సన్నివేశాలతో, చక్కటి కథనం, చాలా ఆసక్తికరమైన డ్రామాతో కథను నడిచింది. ఇక రెండవ అర్ధ భాగం. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కథలోకి ప్రవేశించి ప్రేక్షకులకు మంచి కామెడిని అందించారు. ఈగ తనే నాని అని సమంతకి చెప్పే సన్నివేశం అందర్నీ అబ్బురపరిచే విధంగా ఉంది. ఈ సన్నివేశానికి థియేటర్ మొత్తం ప్రేక్షకుల చప్పట్లు మరియు విజిల్స్ తో మారు మ్రోగిపోయింది. ఈగ మానసికంగా మరియు శారీరకంగా కొత్త కొత్త పద్దతులలో సుదీప్ ని హింస పెడుతోంది. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. తాగుబోతు రమేష్ కథలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను బాగా నవ్వించాడు. ఒకరి మీద ఒకరు పగ ప్రతీకారాలు తీర్చుకునే సన్నివేశాలు ఆకాశాన్ని అంటే రేంజ్లో ఉన్నాయి. ఈగ మరియు సుదీప్ లు ఒకరిని ఒకరు చంపేందుకు ఎంచుకునే పద్దతులు, ఘట్టాలు ప్రేక్షకులకు అమితానందాన్ని ఇచ్చాయి. సూపర్బ్ క్లైమాక్స్ తో ఈ చిత్రం ముగిసింది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రతీ ప్రేక్షకుడి కళ్లలో ఉత్సాహం ఉరకలేయడాన్ని ఆంధ్రా విశేష్.కాం గమనించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rojili khan nude photo shoot
Lakshmi prasanna treat for gaddar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles