Priya anand visits tirumala

priya anand visits tirumala

priya anand visits tirumala

16.gif

Posted: 07/05/2012 07:06 PM IST
Priya anand visits tirumala

    priya_anand_ineee  లీడర్ సినిమా ఫేం ప్రియా ఆనంద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన విరామసయంలో ఆమె తిరుమలేశుని కొలిచారు. మొక్కులో భాగంగా ప్రియా ఆనంద్ ఆలయం చుట్టూ 14సార్లు ప్రదక్షిణలు చేశారు. ఇంతగా  తిరుమల వాసునికి ఎందుకు మొక్కులు సమర్పించిందనే దానిమీద ఓ ఊహాగానం ప్రత్యేకం గా వినిపిస్తోంది. ఈ అమ్మడు కి బాలీవుడ్ లో ఆఫర్లు రావటమే కారణమని సినీ విశ్లేషకుల భావన. సౌత్ సంగతి పక్కన పెడితే.. ప్రియా ఆనంద్ ఇప్పుడు ఒక్కసారిగా బాలీవుడ్ లో తేలియాడుతోంది. తన అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. అనుకున్నట్టుగానే వెళ్లీ వెళ్లగానే అక్కడామెకు మంచి స్వాగతమే లభిస్తున్నట్టు కనిపిస్తోంది. శ్రీదేవి నటిస్తున్న 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన ప్రియా, తాజాగా ఒకేసారి ఏకంగా మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకుంది. హీరో నెం 1 , కూలీ నెం 1 వంటి భారీ చిత్రాలను నిర్మించిన బాలీవుడ్ ఫిలిం మేకర్ వాసు భగ్నానీతో ఈ డీల్ చేసుకుందట. తన తనయుడు జాకీ భగ్నాని హీరోగా, వాసూ నిర్మించే 'రంగ్ రేజ్' సినిమాలో ప్రియా ముందుగా కథానాయికగా నటిస్తుంది. అలాగే, వాసూ నిర్మించే తదుపరి రెండు సినిమాలలో కూడా ఆమె కథానాయికగా నటించడానికి ఒప్పందం చేసుకుంది. ఇంత బంపరాఫర్ ప్రసాదించిన శ్రీవారికి మొక్కు సమర్పించుకోవాలి మరి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannath films progress
Kochhadian release on 121212  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles