Raja mouli fear

raja mouli fear

raja mouli fear

10.gif

Posted: 06/28/2012 04:25 PM IST
Raja mouli fear

     3e

      సంచలన దర్శకుడేకాదాయన సంచలన వార్తలు తయారు చేసే క్రియేటివ్ జర్నలిస్ట్ కూడా.. అతనింకెవరో కాదు.. మన రామ్‌ గోపాల్‌ వర్మ. ఈ సంచలనం  మరోసారి వార్తల్లోకి వచ్చాడు. కొన్నాళ్లపాటు ప్రేక్షకుల్ని భయపెడతానంటూ దయ్యాల సినిమాలు తీసిన వర్మ కొద్దికాలంగా ఏదో ఓ కామెంట్‌ చేస్తూ న్యూస్‌లో స్థానం సంపాదిస్తున్నాడు.  ఈ దఫా విభిన్నంగా ఓ ప్రముఖ దర్శకుడ్ని తన పొగడ్తతో భయపెడుతున్నాడు. రాము ఇచ్చిన కాంప్లిమెంట్‌తో భయపడుతున్న ఈ టాలీవుడ్ స్టార్‌ దర్శకధీరుడు ఎవరా అనుకుంటున్నారా... ఎవరో కాదండి తెలుగు సినిమా స్టామినా ఏంటో నిరూపించిన  స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి. వర్మ లాంటి గ్రేట్‌ డైరెక్టర్‌ పొగితే సంతోషపడాలి గాని భయపడటమేంటి అనుకుంటున్నారా..? అందులోనూ ఓ లాజిక్‌ ఉంది. గతంలో వర్మ ఇలా ఆకాశానికెత్తేసిన 3eeసినిమాలన్నీ అట్టర్‌ ఫ్లాప్స్‌ గా మిగిలియి. దీంతో ఇప్పుడు ఈ సినిమా వర్మ కామెంట్‌ దెబ్బకు ఎమైపోతుందో అని భయపడుతున్నాడు రాజమౌళి. ఇంతకీ ఇంత చర్చకు కారణం అయిన ఆ కామెంట్‌ ఎంటనుకుంటున్నారా.. మరేం లేదండి. ఈగ సినిమా చూసిన వర్మకి అది విపరీతంగా నచ్చేసిందట అందుకే ఈ సినిమా ఎలాగైన 100 కోట్లు కలెక్ట్‌ చేసేస్తుందని మొన్నరాత్రి ఓ ట్వీటిచ్చాడు. వర్మ మాటలు నిజమై నిజంగానే ఈగ 100 కోట్ల మార్క్‌ అందుకుంటే మాత్రం రాజమౌళికి జాతీయస్థాయిలో మంచి ఇమేజ్‌ వస్తుంది. ఒకవేళ అందుకోలేక పోతే మాత్రం ఆ పాపమంతా వర్మమేడకే చుట్టుకుంటుంది మరి. కాని ఇలాంటి విశ్లేషణలు వర్మకు పడతాయంటారా... ఆయనసలే.. మోనార్కాయే....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan latest movie cgtr puch
Young tiger ntr as a james bond in srinu vaitla film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles