Young tiger ntr as a james bond in srinu vaitla film

young tiger ntr as a james bond in srinu vaitla film..?

young tiger ntr as a james bond in srinu vaitla film..?

9.gif

Posted: 06/28/2012 03:57 PM IST
Young tiger ntr as a james bond in srinu vaitla film

7....     

     ఇన్నాళ్లూ శ్రీను వైట్ల సినిమాలో యంగ్ టైగర్ సరికొత్తగా కనిపించబోతున్నాడని ఊదరగొట్టాం కదా... దానిమీద ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. ఓ మారు సింహావలోకనం చేసుకుంటే,.. రహస్య గూఢచారి కథలతో తెలుగులో ఇప్పటి వరకు చాలా సినిమాలే తెరపైకొచ్చాయి కానీ త్వరలో ఓ స్టైలిష్ గూఢచారి మన ముందుకు రానున్నాడు. అతడు మరెవరోకాదు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్. మాస్ హీరోగా అలరిస్తున్న 2eఎన్టీఆర్ త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బాద్‌షా’ చిత్రంలో రహస్య గూఢచారిగా స్టైలిష్ పాత్రలో కనిపించనున్నాడని చిత్ర వర్గాల సమాచారం. ఇది బాలీవుడ్ ఏజెంట్ పాత్ర మాదిరి ఉంటుందని వినికిడి. ఇక షూటింగ్ కి వెళ్లి వేట మొదలెడితే రాతరాసినోడొచ్చినా యువ సింహాన్ని ఆపలేరేమో...
     ఇక ఈ చిత్రాన్ని  పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జూలై 1 నుంచి ఇటలీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అక్కడి వివిధ ప్రదేశాల్లో 25 రోజుల పాటు కథకు కీలకమైన దృశ్యాలను చిత్రీకరించనున్నారు. ఈ వారంలోనే చిత్ర యూనిట్ ఇటలీ బయలుదేరనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం హలీవుడ్ క్రేజీ సింగర్ అకాన్ ఓ పాట పాడనుండగా అతనితో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గొంతు కలపబోతోంది.
     ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని ఆయన గత చిత్రాలకు భిన్నంగా దర్శకుడు శ్రీనువైట్ల కొత్త లుక్‌తో చూపించనున్నాడు. ఇందుకోసం ముంబైకి చెందిన స్టైలిస్ట్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అత్యంత భారీస్థాయిలో శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న ‘బాద్‌షా’లో ఎన్టీఆర్ రహస్య గూఢచారి విన్యాసాలు చూడతరమా అనిపించేలా ఉండాలని కోరుకుందాం.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raja mouli fear
Allu arjun dance in mahesh babu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles