Charan and upasan coming back to hyderabad

charan and upasan coming back to hyderabad

charan and upasan coming back to hyderabad

11.gif

Posted: 06/22/2012 06:58 PM IST
Charan and upasan coming back to hyderabad

     6eeభూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి లో అంగరంగ వైభవంగా తన చిన్న నాటి చెలికత్తె ఉపాసనను పెండ్లాడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన షూటింగ్ పనుల్లో బిజీ కాబోతున్నాడు.  కొత్త పెళ్లికొడుకైన  రామ్ చరణ్ స్వల్ప హనీమూన్ ట్రిప్ కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. చెర్రీ ఉపాసన జంట కొద్ది సేపటి క్రితమే తిరిగి హైదరాబాదు చేరుకున్నాడు. వాటికన్, ఫ్రాన్స్ లలో మూడు రోజుల పాటు భార్య ఉపాసనతో విహారయాత్ర చేసి వచ్చిన చరణ్, మళ్లీ షూటింగులకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న మూడు చిత్రాల షూటింగులు సెట్స్ మీద వున్నాయి. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'చెర్రీ', వంశీ పైడిపల్లి డైరెక్షన్లో 'ఎవడు', హిందీలో 'జంజీర్' చిత్రాలలో చరణ్ ప్రస్తుతం నటిస్తున్నాడు. వీటిలో ఇప్పుడు వీవీ వినాయక్ సినిమా 'చెర్రీ' షూటింగు జరుగుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగులో చరణ్ పాల్గొంటాడని తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన కాజల్, అమలాపాల్ కథానాయికలుగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొంత విరామం తర్వాత మళ్లీ చెర్రీ తన పనుల్లో బిజీ కాబోతున్నాడన్నమాట.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun next movie lover
Allu sirish says about his debut movie gouravam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles