Shankar and vikram samanta new movie titled i

shankar and vikram samanta new movie titled i

shankar and vikram samanta new movie titled i

5.gif

Posted: 06/22/2012 06:33 PM IST
Shankar and vikram samanta new movie titled i

    4e  సంచలనాలకు మారుపేరైన క్రియేటివ్ డైరెక్టర్ శంకర్. 'స్నేహితుడు' చిత్రం తర్వాత ఈ తమిళ దర్శకుడు రూపొందించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళే వెలువడింది. విక్రమ్, సమంతా జంటగా నటించే ఈ చిత్రానికి 'తిర్డాల్' అనే పేరు పెట్టినట్టు నిన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే, ఈ చిత్రం పేరు 'ఐ' అని శంకర్ తాజాగా ప్రకటించాడు. తమిళంలో 'ఐ' అంటే అందం, రాజు, గురువు... వంటి పలు అర్ధాలున్నాయి. అయితే, శంకర్ ఏ భావంతో ఈ పేరు పెట్టాడో మాత్రం తెలియరాలేదు. సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతుందని శంకర్ చెప్పడాన్ని బట్టి చూస్తే కనుక, 'అందం' అనే అర్థాన్నే తీసుకోవచ్చు! 2e కాగా, కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తున్నట్టు శంకర్ వెల్లడించాడు. MIB (Men in Black) చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన  మేరీ వాగ్ట్ దీనికి పనిచేస్తున్నాడు. చైనాకు చెందిన పీటర్ మింగ్ యాక్షన్ దృశ్యాలు కంపోజ్ చేస్తాడు. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరాం ఫోటోగ్రఫీ బాధ్యత నిర్వహిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగు మొదలవుతుందని శంకర్ వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా అపరిచితుడంతటి వైభవాన్ని సాధించుకోవాలని విక్రమ్ ఆశగా ఎదురుచూస్తున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rani mukharji in item songs
Tamil hero karti sekuni movie review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles