మూవీ:శకుని
విడుదల తేది:22 జూన్ 2012 దర్శకుడు:శంకర్ దయాల్
నిర్మాత:బెల్లంకొండ సురేష్
సంగీత దర్శకుడు:జి వి ప్రకాష్ కుమార్
తారాగణం:కార్తీ, ప్రణిత, ప్రకాష్ రాజ్
హలో ఫ్రెండ్స్...... తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచిన తమిళ హీరో కార్తీ నటించిన ' శకుని ' మూవీ ఇవాళే రిలీజ్ అయింది. చేసినవి కొన్ని చిత్రాలే అయినా తెలుగులో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న కార్తీ. యుగానికి ఒక్కడు, అవారా, నా పేరు శివ వంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ దఫా శకుని అనే సినిమాతో ముందుకొచ్చాడు. శంకర్ దయాల్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ ప్రణీత హీరొయిన్ గా వచ్చిన ఈ సినిమా తమిళ్లో ‘శగుని’ పేరుతో కూడా ఈ రోజే విడుదలైంది. ఈ మూవీ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు విశ్లేషిద్దాం..
స్టోరీ:
క్లుప్తంగా చెప్పాలంటే తన వ్యక్తిగత సమస్య పరిష్కారినికి ప్రయత్నించే మార్గంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రితో ఢీకొన వలసిన పరిస్థితి హీరోకి ఎదురవుతుంది. ఈ క్లిష్ట సమస్యను హీరో ఏ క్రమానుకతంలో నెట్టుకొచ్చాడనేదే చిత్ర సారాంసం. ఇక కథనం ఎలా సాగిందనే విషయానికొస్తే... కాకినాడ పక్కనే ఉన్న సామర్ల కోటలో కమల్ కృష్ణ (కార్తీ) కుటుంబం నివసిస్తూ ఉంటుంది. తరతరాలుగా వస్తున్న కమల్ ఇల్లును రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా తొలగిస్తున్నట్లు రైల్వే శాఖ నుండి నోటీసు వస్తుంది. దీనిపై, కమల్ రైల్వే మంత్రికి అర్జీ పెట్టుకోవడానికి హైదరాబాదుకి వస్తాడు. అక్కడికి వెళ్ళిన కమల్ కి ఆ బ్రిడ్జి కాంట్రాక్టు తీసుకుంది ముఖ్యమంత్రి ఆర్కే భూపతి (ప్రకాష్ రాజ్) అని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో సాగేదే చిత్ర కథాంశం.
కథనం నడిచిన తీరు :
ప్రకాష్ రాజ్, చంద్రమోహన్ ల పరిచయ సన్నివేశాలతో మొదలైన సినిమా రాజకీయ సంభంద సన్నివేశాలతో ముందుకు సాగుతోంది. ఇంతలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే డైలాగ్స్ తో చాలా సింపుల్ గా కార్తీ కథలోకి ప్రవేశిస్తాడు. ఇంట్రడక్షన్ సాంగ్ ఫర్వాలేదనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకుల మీద సెటైర్లతో సినిమా సాగుతోంది. ఊహించని విధంగా ప్రేక్షకులు అవాక్కయ్యేలా ప్రత్యేక పాత్రలో అనుష్క కథలోకి ఎంట్రీ ఇవ్వటం బావుంది. పోలీసు డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు అనుష్క అనంతరం కథానాయిక ప్రణిత కథలోకి ప్రవేశించిన అనంతరం ' రంగు బొంగరం' అనే రెండవ పాట మొదలైంది. లిక్కర్ డెన్ లో జరిగిన మొదటి ఫైట్ ఆకట్టుకుంటుంది. కార్తీకి తోడుగా ఉండే వ్యక్తిగా కమెడియన్ శాంతనం ఓకే.
కమల్ హాసన్ పేరుతో కార్తీ మరియు రజినీకాంత్ పేరుతో శాంతనంలు ప్రేక్షకులను కాసేపు నవ్విస్తారు. రాజకీయ ట్రాక్ ని పక్కన పెట్టి, కార్తీ, ప్రణితల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ పండింది. ప్రకాష్ రాజ్, కార్తీలు ఒకరికొకరు ఎదురుపడి వాదించుకునే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విలక్షణ నాటి రాధిక లోకల్ డాన్ రమణక్కగా మెప్పించింది.
కొంత ఆట పాట, మరికొంత పొలిటికల్ సెటైర్స్ తో ఫస్టాఫ్ సాగితే, సెకండాఫ్ లో కార్తీ ప్రణితల మధ్య మరో డ్యూయెట్ సాంగ్ తో మొదలవుతుంది. ఈ పాటని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. బి.డీ స్వామీజీ పాత్రలో నాజర్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కార్తీ, రాధికలు ఎలక్షన్ కోసం చేసే ప్రచార సన్నివేశాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకొంటున్నాయి. ప్రకాష్ రాజ్ మరియు కార్తీల మధ్య వచ్చే పొలిటికల్ గేమ్ ఆశక్తిగా సాగుతోంది. పొలిటికల్ లీడర్ పెరుమాళ్ పాత్రలో కోట శ్రీనివాస రావు కథలోకి ప్రవేశింస్తారు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం డబ్బులు పంచడం మరియు ఓట్ల కోసం వేసే జిత్తులమారి వేషాలను చాలా ఆసక్తికరంగా ఈ మూవీలో తెరకెక్కించారు. హీరోయిన్ ప్రణిత మళ్లీ కథలోకి ప్రవేశించడంతో రొమాంటిక్ ట్రాక్ మళ్ళీ షురూ అయ్యింది. అనంతరం ప్రేక్షకుడి ఊహకి అందనంతగా కథలో ఒక మలుపు ఇంకా, రాజకీయ నేతృత్వంలో వచ్చే సన్నివేశాలు ఉద్రిక్త స్తాయికి చేరుకున్నాక కథ కంచికి చేరుతుంది.
అనుకూలాంశాలు :
ఇంతకుముందు సినిమాల్లో చూపించినట్టే ఈ మూవీలోనూ హీరో కార్తీ నటనలో స్టామినా ప్రదర్శించాడు. డాన్సులు చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఫైట్స్ పర్వాలేదనిపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ చేస్తూ రెండవ భాగంలో పొలిటికల్ గేమ్ ఆడుతూ అలరించాడు. రమణక్క పాత్రలో రాధిక చాలా బాగా చేసింది. ముఖ్యమంత్రి ఆర్కే భూపతిగా ప్రకాష్ రాజ్ రక్తికట్టించాడు. ప్రతిపక్ష నాయకుడు వి.టి.ఎమ్.కె పార్టీ అధ్యక్షుడు పెరుమాళ్ళు పాత్రలో కోట న్యాయం చేశాడు. లేడి పొలిటీషియన్ వసుంధర పాత్రలో కిరణ్ రాథోడ్ పాత్ర పరిధి మేరకు నటించింది. ఆటో డ్రైవర్ రజినీ పాత్రలో సంతానం నవ్వించే ప్రయత్నం చేసాడు. బీడీ బాబా పాత్రలో నాజర్ మార్కులు కొట్టేశాడు.
ప్రతికూలాంశాలు :
శ్రీదేవి పాత్రలో కథానాయిక ప్రణీత పరిధి చాలా పరిమితం. కార్తీ, సంతానం మధ్య కామెడీ సన్నివేశాలు బాగానే ఉన్నా స్టొరీ నేరేషన్ పేలవంగా ఉంది. సినిమా ప్రారంభంలో సత్యమూర్తి (చంద్ర మోహన్) పాత్రని కేవలం అక్కడే చూపించి ఆ పాత్ర ఎపిసోడ్ కి దర్శకుడు సరైన జస్టిఫికేషన్ చేయలేకపోయాడు. చిత్ర రెండవ భాగంలో ప్రేక్షకుడికి ఆసక్తిని పెంచలేకపోయారు. స్క్రీన్ప్లే లో లోపాలు కనిపిస్తాయి. దర్శకుడి మొదటి సినిమా కావడంతో డైరెక్షన్ విషయంలో తడబడ్డట్టు అనిపిస్తుంది. రోజా పాత్రని కూడా సరిగా పండించలేకపోయారు.
టెక్నికల్ టీం:
కొన్ని సన్నివేశాల్లో లిప్ సింక్ కుదరలేదు, డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు, డైలాగుల విషయంలో కూడా ఇంకాస్త శ్రద్ధ చూపించి ఉంటే బావుండేది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అక్కరకు రాలేదు. పాటల్లోనే కాదు, నేపధ్య సంగీతం కూడా శ్రావ్యంగా లేదు. సినిమాటోగ్రఫీ బావుందనిపించినా ఎడిటింగ్ గజబిజి అయ్యింది.
ఫైనల్ పాయింట్ : మొత్తంగా శకుని యావరేజ్ అనిపిస్తాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more