Sriya list

sriya list

sriya list

13.gif

Posted: 06/19/2012 03:55 PM IST
Sriya list

     నేనే అతని తొలి ప్రపంచం కావాలంటోంది చేప కళ్ల శ్రియా. ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పుడు చాంతాడంత కోరికల లిస్టు బయటపెడుతోంది.4e కొత్త సినిమాల ఎంపికలో అనుకుంటున్నారా... ఆ విషయంలో ఇప్పుడు ఆమెకంత సీను లేదుకదా... మరి, ఎందులో అనే కదా మీ డౌటు? అక్కడికే వస్తున్నాం...  తన కాబోయే శ్రీవారికి ఉండాల్సిన లక్షణాలకు సంబంధించిన లిస్టు అది. తన కాబోయే మొగుడు ఏ విషయాన్నీ తన దగ్గర దాచకూడదట... ఏదైనా సరే తనకు తెలిసే చేయాలట. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అతనికి తన తర్వాతే అవ్వాలట. "అవును... నేనే అతని తొలి ప్రపంచం కావాలి. నన్ను అర్ధం చేసుకునే మనస్తత్వం వుండాలి. నేను చెప్పిన దానికి కాదనకూడదు. ఎంతో నిజాయతీపరుడై వుండాలి..." అంటూ సవా'లక్ష' కండిషన్లు పెడుతోంది. అయితే, ఈ లక్షణాలున్న మొ(న)గాడు ఇంతవరకు ఆమెకు తారసపడలేదట. పడితే కనుక పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకుంటానని చెబుతోంది శ్రియా. నిజంగా ఇన్ని లక్షణాలున్న పురుష పుంగవుడు ఈ అందగత్తెకి దొరుకుతాడా... అన్నదే ఇప్పుడు చాంతాడంత సంశయం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger ntr new look in badsha movie
Lakshmi rai new strategy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles