Ram charan in agnipath remake

ram charan in agnipath remake

ram charan in agnipath remake

11.gif

Posted: 06/18/2012 01:38 PM IST
Ram charan in agnipath remake

     5e మెగా అభిమానులకు మరో సంతోషకర వార్త. హృతిక్ రోషన్ కథానాయకుడుగా ఇటీవల రూపొందిన 'అగ్నిపధ్' హిందీ చిత్రం విడుదలైన వెంటనే... ఆ సినిమా 'అద్భుతం' అంటూ రామ్ చరణ్ కామెంట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అలా తన మనసు దోచిన ఈ చిత్రం తెలుగు రీమేక్ లో చరణ్ నటించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. 'అగ్నిపధ్' చిత్రాన్ని నిర్మించిన బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ దీనిని తెలుగు, తమిళ భాషల్లో తన దర్శకత్వంలో రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  దక్షిణాది మార్కెట్ విస్తృతి దృష్ట్యా దీనికి చరణ్ కథానాయకుడైతే... మంచి బిజినెస్ చేయచ్చన్న ఉద్దేశంతో కరణ్ జోహార్, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట. పైపెచ్చు, 5ee'జంజీర్' సినిమాలో చరణ్ గెటప్ స్టిల్స్ చూశాక, 'అగ్నిపధ్' లోని కథానాయకుడు విజయ్ దీనానాధ్ చౌహాన్ పాత్రకు చరణ్ సరిగ్గా సరిపోతాడని కరణ్ భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించి అప్పుడే మెగా ఫ్యామిలీతో చర్చలు కూడా మొదలయినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఈ వార్తలకు తగ్గట్టు ఇందులో చరణ్ నటిస్తే కనుక, నిజంగానే ఇదొక సంచలన చిత్రమవుతుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun tamil teramgetram
Tara chowdary statement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles