Nag and allu arjun amitab styles in charan marriage function

nag and allu arjun amitab styles in charan marriage function

nag and allu arjun amitab styles in charan marriage function

19.gif

Posted: 06/15/2012 07:46 PM IST
Nag and allu arjun amitab styles in charan marriage function

     3e1చరణ్ వివాహం కొన్ని ఆసక్తికర ద్రుశ్యాలకు నెలవైంది. డ్రెస్సింగ్ విషయంలో మరియు కొత్తరకమయిన స్టైల్ విషయంలో నాగార్జున ఎప్పుడు ఒక అడుగు ముందుంటారు. నిన్న రామ్ చరణ్ పెళ్లిలో నాగార్జున తన సరికొత్త లుక్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. నాగార్జున లుక్ చాలా బాగుంది ఈ లుక్ నాగార్జున నుండి ఎవరూ ఊహించనిది. స్పైక్స్ తో విభిన్నమయిన గడ్డంతో చూపరులను ఆకట్టుకున్నారు. “షిరిడి సాయి” చిత్రం లుక్ నుండి ఈ లుక్ చాలా విభిన్నంగా ఉంది. ఈ లుక్ నాగార్జున -దశరథ్ ల చిత్రంలో లుక్ అని పరిశ్రమ వర్గాలు అనుకుంటున్నాయి
     కాగా, బన్నీ అతని భార్యను ఎంతగా ప్రేమిస్తాడో కూడా ఈ చరణ్ ఉపాసన పెళ్ళిలో రుజువైంది.3e2 ఈ పెళ్ళిలో వధూవరుల కంటే ఈ జంటే ఫోటో గ్రాఫర్లకి ఫేవరేట్ గా మారిపోయింది..వేలాది మంది హాజరైన ఈ వివాహ వేడుకలో బన్నీ తన భార్యపై ఎంత పబ్లిక్ గా ప్రేమ కురిపిస్తున్నాడో చూడండి.. పెళ్ళయి ఏడాది పూర్తయినా ఇంకా కొత్తగా పెళ్ళయిన వాడిలానే స్నేహపై అమితమైన ప్రేమని చూపిస్తున్న బన్నీని చూసి పెళ్ళికొచ్చిన వారంతా ముచ్చట పడ్డారు.."ఇంతా అంతా ప్రేమైతే గుండెల్లో దాచుకునే వాడిని..కాని నీ మీద నాకు దాచుకోలేనంత ప్రేమ ఉంది.. ఫీల్  మై లవ్ " అని ఆర్యలో చెప్పిన డైలాగ్ కి అర్థం ఇదేనేమో...
       మరో విశేషమేమంటే...  చరణ్ - ఉపాసన వివాహ వేడుక జాతీయ స్థాయిలో అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఓ వైపున ఆధునీకతకు ప్రాధాన్యతని ఇస్తూనే ... మరో వైపున భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేయడమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇక అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకి, అమితాబ్ కూడా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించిన ఆయన, తిరిగి అదే రోజు రాత్రికి ముంబై లోని తన స్వగృహానికి చేరుకున్నారు.  వెంటనే ఈ వివాహ వేడుక పట్ల తన స్పందనని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 3e3e''సంప్రదాయాలకి అగ్ర తాంబూలమిస్తూ ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుక తనకి ఎంతో ఆనందాన్నీ ... ఆహ్లాదాన్ని కలిగించిందని అన్నారు. ''భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఏ ఈవెంట్ అయినా చూడటానికి మనోహరంగా ... మహాద్భుతంగా ఉంటుంది'' అంటూ ట్వీటిచ్చారు...బిగ్ బి

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan puri movie shooting begins
Sriya acts in a bollywood movie item song and richa fate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles