Sriya acts in a bollywood movie item song and richa fate

sriya acts in a bollywood movie item song and richa fate

sriya acts in a bollywood movie item song and richa fate

15.gif

Posted: 06/15/2012 07:11 PM IST
Sriya acts in a bollywood movie item song and richa fate

     2eef నాజూకు సౌందర్యం శ్రియా తన ఐటెం పాటల సౌరభాన్ని బాలీవుడ్ లో కూడా వెదజల్లే ప్రయత్నం చేస్తోంది. ఇన్నాళ్లూ దక్షిణాదిన ఇలాంటి గీతాలలో నటించి, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఢిల్లీ భామ, తొలిసారిగా ఓ హిందీ చిత్రంలో ప్రత్యేక గీతాన్ని చేస్తోంది. వివేక్ ఒబెరాయ్, సంజయ్ దత్ కథానాయకులుగా రూపొందుతున్న 'జిల్లా ఘజియాబాద్' అనే బాలీవుడ్ చిత్రంలో ఆమె ఈ ప్రత్యేక పాటలో తన సోయగాలను గుమ్మరించనుంది. ఇది చాలా సరదాగా సాగే పాట అనీ, తొలిసారిగా హిందీ చిత్రంలో ఇలాంటి పాట చేస్తున్నందుకు హ్యాపీగా ఉందనీ శ్రియా చెబుతోంది. కాగా, ప్రస్తుతం ఆమె తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 
      రిచా జాతకం ఈ ధఫా మారేనా అనే మీమాంస టాలీవుడ్ లో తాజాగా వినిపిస్తోంది. ముద్దుగా ... ముచ్చటగా కనిపించే రిచా 'లీడర్' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. 2eaaఆ తరువాత 'మిరపకాయ్' చిత్రంతో ఆమెకి సక్సెస్ దొరికినా, అది ఆమె ఖాతాలోకి చేరలేదు. ఈ మధ్యలో అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ, అవి ఆమెకి ఏ రకంగాను మేలు చేయలేక పోయాయి. ఇక మరి కొన్ని చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి.  ఈ నేపథ్యంలో రిచా పనైపోయిందనే అందరూ అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె కెరియర్ గ్రాఫ్ లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం నితిన్ హీరోగా ''కొరియర్ బాయ్ కళ్యాన్' ... రవితేజా సరసన 'సారొస్తారా' వంటి చెప్పుకోదగిన చిత్రాలు చేస్తోంది. ఇక తమిళంలో సైతం గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తోన్న రెండు చిత్రాలను రిచా చేస్తోంది. అటు తమిళంలోనూ ... ఇటు తెలుగులోను రూపొందుతోన్న ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా, రిచా జాతకం మారుతుందేమో చూడాలి...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nag and allu arjun amitab styles in charan marriage function
Vidhya balan new film and sanny leone tollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles