Gabbar singh antyakshari team

gabbar singh antyakshari team

gabbar singh antyakshari team

19.gif

Posted: 06/10/2012 07:59 PM IST
Gabbar singh antyakshari team

     'గబ్బర్ సింగ్' సినిమాలో పోలీస్ స్టేషన్లో 'అంత్యాక్షరి' సీన్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.    కొత్త ఆలోచనతో సరికొత్తగా చేసిన ఈ ప్రయోగం అనూహ్యమైన స్థాయిలో ప్రేక్షకులని అలరించింది. సహజత్వానికి దగ్గరగా మలచిన ఈ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా  ... gabbaree పదే పదే తిరిగి వాళ్లని థియేటర్లకి రప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. సాధారణంగా సినిమాల్లో కనిపించే చిల్లర రౌడీలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలాంటిది ఈ ఒక్క సన్నివేశం కారణంగా అందులో నటించిన చాలా మంది చిన్న ఆర్టిస్టులకి మంచి క్రేజ్ రావడం విశేషం. తమకి ఇంతటి గుర్తింపు రావడానికి కారణమైన పవన్ పట్ల వాళ్ళెంతో కృతజ్ఞతతో ఉన్నారు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన కారణంగా వాళ్లంతా కలిసి పవన్ ఇంటికి వెళ్లి సరదాగా ఆయనని కలిశారు. పవన్ కూడా వాళ్ళందరిని ఆత్మీయంగా పలకరించి, వాళ్ల  సంతోషాన్ని రెట్టింపు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కలిసి పవన్ కళ్యాన్ తో సరదాగా ఓ ఫోటో దిగారు.sr
     కాగా, గబ్బర్ సింగ్ ద్వారా తన తొలి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న కథానాయిక శృతి హాసన్ కి యన్టీఆర్ పక్కన నటించే అవకాశం రెండోసారి వచ్చింది. మొన్నామధ్య  'దమ్ము' సినిమాలో కథానాయికగా ఎంపికై, కొన్నాళ్లు షూటింగు చేసి, హఠాత్తుగా ఆ ప్రాజక్టు నుంచి తప్పుకున్న శృతి హాసన్, తాజాగా మళ్లీ యన్టీఆర్ సినిమాకి ఎంపికైంది. హరీష్ శంకర్  దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా రూపొందనున్న చిత్రానికి ఆమె సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల 'గబ్బర్ సింగ్' సినిమాలో శృతితో కలిసి పని చేసిన దర్శకుడు హరీష్, మళ్లీ ఆమెకు ఇందులో చాన్స్ ఇస్తున్నాడు. మొదట్లో ఈ చిత్రాన్ని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిర్మిస్తాడని వార్తలొచ్చినా, ఇప్పుడీ ప్రాజక్టు దిల్ రాజు చేతికొచ్చింది. MLA టైటిల్ తో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంచితే, 'గబ్బర్ సింగ్' సినిమాతో ఐరెన్ లెగ్ బ్రాండ్ ను తుడిచేసుకున్న శృతి హాసన్ కి టాలీవుడ్ లొ ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Julayi audio release
Balayya babu birthday wishesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles