Julayi audio release

julayi audio release

julayi audio release

5.gif

Posted: 06/11/2012 02:13 PM IST
Julayi audio release

2

దాసరి నారాయణరావు, పవన్ కల్యాణ్ ముఖ్య అతిధులుగా 'జులాయి' చిత్రం ఆడియో వేడుక  హైదరాబాదులో హైటెక్స్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. ఈ సినిమా పాటలను పవన్ కల్యాణ్ ఆవిష్కరించగా, తొలి సీడీని దాసరి స్వీకరించారు. సినిమా ట్రైలర్స్ ను దాసరి, సంస్థ లోగోను అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ,  ‘నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే... తెలుగు సినిమా పుట్టిన కొన్నాళ్ల వరకూ కథ, మాటలు రాసినవాళ్ళెవరూ దర్శకులుగా సక్సెస్ కాలేకపోయారు. దాన్ని బ్రేక్ చేసింది నేనే. నా తర్వాత జంధ్యాల ఆ క్రెడిట్ సాధించారు. మా దారిలోనే త్రివిక్రమ్ కూడా విజయం సాధించడం ఆనందించదగ్గ విషయం. ఒక మంచి రచయిత దర్శకత్వంలో సినిమా వస్తే ఆ సినిమా ఒక కావ్యం అవుతుంది. అందుకు ఏన్నో సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు.

3
     అంతేకాదు.. నేను ‘జల్సా’ సినిమాను ఎప్పటికీ మరిచిపోలేను. ‘జులాయి’తో త్రివిక్రమ్ మళ్లీ తన జండా ఎగురవేస్తాడని నా నమ్మకం. ‘గంగోత్రి’లో బన్నీని చూసినప్పుడు.. ‘ఇతను కామెడీ హీరో అవుతాడా? లేక ఫ్యామీలీ హీరో అవుతాడా?’ అనే ఆలోచనలు నా మనసులో మెదిలాయి. నా ఆలోచనలకు భిన్నంగా తనకంటూ ఓ సపరేట్ రూట్‌ని క్రియేట్ చేసుకున్నాడు బన్నీ. ‘దేశముదురు’ చూసి తనలో ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. వారం రోజుల క్రితమే పాటలు విన్నాను. ఈ పాటలకు థియేటర్లలో ప్రేక్షకులు డాన్సులుచేస్తారు’’ అని దాసరి నారాయణరావు అన్నారు.

4
     పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కేవలం రెండు మూడు లైన్లలోనే తన ప్రసంగాన్ని ముగించారు.  ఒక విధంగా చెప్పాలంటే, ఇది అల్లు అర్జున్ సినిమా వేడుకైనప్పటికీ, పవన్ కల్యాణ్ వేడుకలా సాగింది. అభిమానులు 'పవర్ స్టార్' అంటూ ఆద్యంతం అరుస్తూ కేరింతలు కొట్టడం, అతిధులంతా పవన్ కల్యాణ్ గురించే మాట్లాడడం అలాంటి వాతావరణాన్ని తలపించింది. 

5

  అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘జులాయి’. ఇలియానా కథానాయిక. డీవీవీ దానయ్య సమర్పకుడు. ఈ వేడుక చిత్రాలు మీకోసం..

6

7

 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cine stars at julayi red carpet look
Gabbar singh antyakshari team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles