Sridevi in gundamma katha remake

Gundamma katha remake, gundamma kadha remake, sridevi gundamma katha remake, sridevi gundamma kadha remake, sridevi suryakantham, suryakantham sridevi, sridevi gundamma

Yesteryear queen of Bollywood Sridevi is likely to act in 'Gundamma Katha' remake, says film nagar sources. Recently, a leading producer from Tollywood

Sridevi in Gundamma Katha Remake.gif

Posted: 06/08/2012 03:05 PM IST
Sridevi in gundamma katha remake

Sridevi

సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం విజయా బ్యానర్ లో వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం ‘గుండమ్మ కథ’. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు నటించారు. ఇందులో గుండమ్మత్తగా ‘సూర్యకాంతం’ నటించింది. ’సూర్యకాంతం‘ అంటే ఈ తరం వాళ్ళకి అంత పెద్దగా తెలియపోవచ్చు కానీ, ఆ కాలంలో కోడళ్ళకు ‘సూర్యకాంతం‘ బాగా గుర్తుండి ఉంటుంది. ఎందుకంటే సూర్యకాంతం గయ్యాళి అత్తగా సినిమాల్లో అంత పేరు సంపాదించింది. ఆమె సినిమాలు చూసిన వారు ఇలాంటి అత్త మాకు ఉండకూడదు అనుకునేంత. ఇదంతా రీల్ లైఫ్ వరకే. రియల్ లైఫ్ లో మాత్రం ‘సూర్యకాంతం’ మంచి మసనుస్నామె. ఆ సంగతి అలా ఉంచితే... ‘గుండమ్మ కథ’ చిత్రం  వచ్చి ఇన్నేళ్ళయినా ఆ సినిమాని ఇప్పటికీ మరచిపోలేం. అన్ని వర్గాల  ప్రేక్షకులని విశేషంగా అలరించిన ఈ సినిమాని రీమేక్ చేసేందుకు ఎప్పటి కప్పుడు ప్రయత్నించినప్పటికీ, ఆరంభంలోనే ఆ ప్రయత్నం ఆగిపోతూ వస్తోంది. అందుకు కారణం గుండమ్మ పాత్రని సూర్యకాంతంలా పోషించే నటీమణి లేకపోవడమే!

ఎన్టీఆర్ - అక్కినేని వారసులైన బాలకృష్ణ - నాగార్జున లతో ఈ సినిమాని రీమేక్ చేయాలని చూసినా, అది గుండమ్మ పాత్ర దగ్గరే ఆగిపోయింది. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా రీమేక్  ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ - నాగ చైతన్య  కథానాయకులుగా ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక వేళ ఈ ప్రాజెక్టు తెరకెక్కిస్తే.. గుండమ్మ పాత్రకి అలనాటి అందాల నటి శ్రీదేవి పేరుని దర్శకుడు క్రిష్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఒక వేళ శ్రీదేవి ఒప్పుకుంటే ‘ఈ తరం గుండమ్మఅత్త’ ముద్ర పడిపోవడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha out of mani ratnam kadal film
Gabbar singh 50 days function in vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles