Director harish shankar clarification

director harish shankar clarification

director harish shankar clarification

17.gif

Posted: 06/07/2012 05:01 PM IST
Director harish shankar clarification

      తాను పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ప్యాన్ అని చెప్పి బంపర్ హిట్టిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. ఈ యువ దర్శకుడి తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో.  ఈ నేపథ్యంలో యన్టీఆర్ అభిమానులు ఈ కాంబినేషన్ పట్ల కాస్త అనాసక్తితో వున్నట్టు తెలుస్తోంది. దానికి2 కారణం కూడా లేకపోలేదు. 'నేను పవన్ కల్యాణ్ కి వీరాభిమానిని' అంటూ హరీష్ చాలాసార్లు స్టేట్మెంట్లు ఇవ్వడమే దీనికి కారణం అని చెప్పచ్చు. పవన్, యన్టీఆర్ ల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ ... అభిమానుల మధ్య లేవన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే, పవన్ అభిమాని అయిన హరీష్ తమ అభిమాన నటుడి సినిమా ఎంతవరకు క్వాలిటీతో ఇవ్వగలడన్నదే యన్టీఆర్ అభిమానుల సందేహం. ఇది పసిగట్టిన హరీష్ తాజాగా ఇందుకు వివరణ ఇచ్చాడు. 'ఒక హీరోని అభిమానిస్తున్నానంటే మరో హీరోని ద్వేషిస్తున్నట్టు కాదు. యన్టీఆర్ మొదటి నుంచీ నన్ను ఓ మంచి స్నేహితుడిలా ఆదరిస్తున్నాడు. ఒక దర్శకుడిగా నా పనితనాన్ని అతను ఎంతగానో గౌరవిస్తాడు. యన్టీఆర్ తో నేను చేయబోయే సినిమా పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు' అంటున్నాడు హరీష్. ఏమైనా, హరీష్ కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందని చెప్పచ్చు. యన్టీఆర్ తో తీసే సినిమాని కచ్చితంగా హిట్ చేయాల్సిన బాధ్యత అతనిపై వుంది. కాబట్టి, హరీష్ కి ఇది నిజంగా యాసిడ్ టెస్ట్ లానే అనిపిస్తోంది. కాగా, ఇటీవల వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా విజయంతో దర్శకుడు హరీష్ శంకర్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కోట్లకు కోట్లు అతనికి ఆఫర్ చేస్తున్నారు. అయితే, ముందు ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం తన తదుపరి చిత్రాన్ని యన్టీఆర్ హీరోగా చేయడానికి హరీష్ రెడీ అవుతున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bumper offers for samantha
50 years gundamma katha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles