50 years gundamma katha

50 years gundamma katha

50 years gundamma katha

5.gif

Posted: 06/07/2012 04:30 PM IST
50 years gundamma katha

      సరదాగా సాగిపోయే ఇతివృత్తం.. ప్రతీ పాత్రకు ప్రాధాన్యం.. గిలిగింతలు పెట్టే నాటకీయత... వీటన్నింటికీ మించి ఇద్దరు అగ్రనటులు...అందులోనూ తెలుగు పరిశ్రమకు రెండు కళ్ల వంటి వారు..ఈ విశేషాలన్నీ ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది.. నిజంగా అద్భుతమే కదూ! ఆ అద్భుతాన్ని సుసాధ్యం చేసిన సినిమా గుండమ్మ కథ. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీరంగరావు. సూర్యకాంతం.. ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై నేటితో సరిగ్గా యాభై ఏళ్లు అవుతోంది. ఇది పూర్తి వినోద భరిత చిత్రరాజం. తరాలు మారినా వినోదం తరగని చిత్రం. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని 1aసమకూర్చాయి. అగ్రశ్రేణి నటీనటులు, మంచి కథ, అంతకు మించే సంగీతం, 1962 జూన్ ఏడున విడుదలైన ఆ సినిమాలో ఎన్నో విశేషాలు, మరెన్నో అద్భుతాలు. అసలు గుండమ్మ అన్నది తెలుగు పేరు కాదు. కన్నడ పేరు ఈ సినిమాకు ఎలా వచ్చిందన్నదన్న ఆసక్తికరమైన విషయం. ఇది కన్నడ సినిమాకు తెలుగు రూపం. 'మనె తుంబెద హెణ్ణు' అనే కన్నడ సినిమా అక్కడ హిట్ అయింది. కన్నడిగుడు అయిన విఠలాచార్య బెంగళూరు నుంచి మద్రాసుకు వచ్చి ఆ సినిమా తీశారు. విజయా అధినేత నాగిరెడ్డి ఆ సినిమాకు స్టూడియో వసతులే కాక ధన సహాయం కూడా చేశారు. అందుకు కృతజ్ఞతగా మిగతా భాషల్లో ఆ సినిమా హక్కులు నాగిరెడ్డికి ఇచ్చేశారు విఠాలాచార్య. ఇది గుండమ్మ కథ పూర్వరంగం. 
     g1 సినిమా కథ మేజర్ పార్టంతా గుండమ్మ ఇంట్లోనే జరుగుతుంది. అందుకని వాహినీలోని మొదటి ఫ్లోర్ లో ఆ సెట్టు వేయించారు. కోలుకోలోయమ్మ కోలో నాసామి పాటతో షూటింగ్ మొదలుపెట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమునలతో ఆ పాట తీశారు. నలుగురు ఎంచక్కా కలిసి ఆనందంగా పాడుకున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ రెండు జంటలూ కూడా విడివిడిగా వచ్చి షూటింగ్ లో పాల్గొన్నాయి. విజయా వారి సినిమాలన్నింటిలో మాదిరే గుండమ్మకథ కూడా భారీ తారాగణంతో తీసిన సినిమా. అయితే ఆ భారీ తారాగణమంతా ఆ రోజుల్లో చాలాచాలా బిజీ ఆర్టిస్టులు. ఇద్దరు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీరంగరావు, హరనాథ్, ఎల్వీ జయలక్ష్మి, రమణారెడ్డి, హేమలత, రాజనాల, ఛాయదేవి, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని వంటి హేమా హేమిలున్నారిందులో.  కానీ చిత్రమేమిటంటే ఇంతమంది తారల దగ్గరా బల్క్ గా కాల్ షీట్లు తీసుకోకుండా తీసిన సినిమా ఇది. కాంబినేషన్ సీన్లున్నా విడివిడిగా తీసి ఆ వెలితి కనిపించకుండా మేనేజ్ చేసిన సినిమా ఇది. చక్రపాణి చమత్కరమిది.        ఈ సినిమాలో ఎన్టీఆర్ వంటి పెద్ద నటుడితో కామెడీ యాక్టర్ కు వేసినట్టు నిక్కరు వేయించడమేమిటని కొందరు పెద్దలు కోప్పడ్డారు. అందుకని మొదటి షెడ్యూల్ పూర్తికాగానే చక్రపాణి తమ స్టూడియోలో పనిచేసే సిబ్బంది పిల్లలందర్ని పిలిపించి గుండమ్మ ఇంటి సెట్ లో తీసిన సన్నివేశాలు చూపించారు.g2 నిక్కరు, బొత్తాలు పెట్టుకోని షర్టు, నెత్తికి మఫ్లరుతో స్ర్కీన్ మీద ఎన్టీఆర్ కనిపించగానే పిల్లలు ఒకటే కేరింతలు, చప్పట్లు, 'నీ క్యారెక్టర్ బ్రహ్మండంగా పండుతుంది రామారావ్..' అంటూ ఆ రోజే చక్రపాణి జోస్యం చెప్పేశారు. ఇది ఎన్టీఆర్ కు వందో చిత్రం. ఎన్టీఆర్ వేషం పక్కా మాస్ మసాలా. మరి నాగేశ్వరరావు వేషం? ఈ సినిమా జాగ్రత్తగా తరచి చూస్తే మనకు అక్కినేని నటనలో పరిణితుడైన నటుడి పనివాడితనం కనిపిస్తుంది. గుండమ్మకథ విడుదలకు ముందు ఈ సినిమాపై కొందరు ప్రముఖులు  పెదవి విరిచారు. దాంతో ఈ సినిమాను విడుదల చేసేందుకు భరోసా లేక వాయిదా వేశారు.  చివరకు సాహసించి విడుదల చేయగా ఎవరు ఊహించినంత విజయం సాధించింది. అప్పటికే కె.వి.రెడ్డి  ఇందులో ఏముందని అంతగా విజయం సాగించింది నాకేం అర్థం కాలేదనేవారు. అలాంటి ఈ సినిమానే తెలుగు చలనచిత్ర జగతిలో ఆణిముత్యంగా మిగిలిపోయింది. ఇక ఎస్వీరంగా రావు ఇద్దరు పిల్లలకు పెళ్ళి చేసి మంచి కోడళ్లను తీసుకురావాలనే క్యారెక్టర్లో నటించారు. తండ్రి పాత్రలో చాలా సహజంగా నటించి తన నటన రూపాన్ని మరోసారి చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
    gud ఈ సినిమాకు కథాబలం , నటీనటులు ప్రతిభ ఒక ఎత్తు . ఘంటసాల సంగీతం మరో ఎత్తు . చిత్రంలోని అన్నీ పాటలు శ్రోతలను అలరించాయి.. అలరిస్తూనే ఉన్నాయి . లేచింది , నిద్ర లేన్చింది మహిళా లోకం 'ఇప్పటికి స్త్రీ శక్తీ గురించి చెప్పే సందర్భాలలో వినిపిస్తూనే ఉంటుంది. నాటి సామాజిక పరిస్థితలుకు తగ్గట్టుగా రాసినా అందులోని పంక్తులు ఇప్పటికీ ప్రస్తావించుకునేలా ఉంటాయి. ప్రేమ యాత్రలకు బృందావనం పాట గురించి ఓ తమాషా విషయం చెప్పుకోవాలి. ఆ పాటను ఏ ఊటి లోనో, మైసూరు గార్డెన్ లోనో అందంగా తీద్దాం అనుకున్నారు దర్సకనిర్మాతలు . అంత వరకూ వెళ్ళడ౦ ఎందుకని చివరికి విజయా గార్డెన్స్ లో చిత్రీకరించారు. ఈ సినిమాలోని మిగతా పాటలన్నీ వినసొంపుగా ఉంటాయి. పింగళి నాగేంద్రరావు అలరించే గీతాలు రాస్తే ఘంటశాల గళం మరింతా సొగసులు అద్దాయి. ఆ అద్భుతమైన పాటలు ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా తనివితీరదు.
      ఇలా ఎన్నో తమాషా సంఘటనల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఆఖరికి ఓ కళాకండమైంది. 50ఏళ్లుదాటినా ఈ చిత్రం తన ఉనికిని కోల్పోలేదు సరికదా. ఈ చరిత్ర ఉన్నంతకాలం చిత్రరాజంలా కొనసాగుతుంది..  ఇదీ గుండమ్మకథాకమామిషు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director harish shankar clarification
Venkatesh and rajani kanth combination  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles