Producer d rama naidu life thunders

producer d rama naidu life thunders

producer d rama naidu life thunders

7.gif

Posted: 06/06/2012 04:59 PM IST
Producer d rama naidu life thunders

     శతాధిక చిత్రాల నిర్మాత.. మూవీ మొఘల్.. పుట్టిన రోజుని ఇవాళ ఆయన కుటుంభసభ్యులతో పాటు సినీ రంగం ఓ పండుగలా జరుపుకుంటోంది. తన  76 వసంతాల జీవిత ప్రస్థానంలో ఎన్నో కీలక మలుపులు, అరుదైన ఘట్టాలు. ఇలాంటి కళామతల్లి ముద్దు బిడ్డ లైఫ్ లో చోటుచేసుకున్న విషయాలపై ఆయన ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం..
      నేను, మా అబ్బాయి వెంకటేశ్‌, మనవళ్ళు రానా, నాగచైతన్య కలిసి నటించాలని ఉంది. ఇటీవలే దీని గురించి తెలిసి. పలువురు రచయితలు కథ సిద్ధంగా ఉందంటూ సంప్రదించారు. ఇంకా కథలు వినలేదు. అతిత్వరలో ఇది కార్యరూపం దాల్చుతుంది అని ప్రముఖ నిర్మాత డా.డి.రామానాయుడు పేర్కొన్నారు. 'ప్రఖ్యాత దర్శకులు కె.ఎస్‌.ప్రకాశరావు కుటుంబానికి మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. మేము నలుగురం నటించ బోయే చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తే బావుంటుందనేది నా అభిప్రాయం' అన్నారు. ఇక భారతీయ భాషల్లో చిత్రాలు తీయాలనే సంకల్పం మొదటినుండి ఉంది. తాజాగా పంజాబీ భాషలో చిత్రాన్ని ప్రారంభించడంతో ఆ కోరిక తీరింది. పంజాబి చిత్రాన్ని ఈనెల 14న లండన్‌లో ప్రారంభిస్తున్నాను. సెప్టెంబర్‌లో విడుదల చేస్తాం. అన్ని భాషల్లో సినిమాలు తీసిన ఘనత నాకే దక్కింది. ఇది ప్రపంచ రికార్డ్‌ అని ఆయన పేర్కొన్నారు.1cfcf
      దర్శకత్వం ఎప్పుడు చేస్తారన్న ప్రశ్నకు : దర్శకత్వం చేయాలనే ఆలోచన చాలాకాలంగా ఉంది. అది నెరవేరడానికి తగిన సమయం వచ్చింది. నేను దర్శకత్వం చేస్తాను అనగానే గతంలో నా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు వచ్చి తాము సహాయ దర్శకులుగా చేస్తామన్నారు. వారిలో బి.గోపాల్‌లాంటి వారు కూడా ఉన్నారు. నా సినిమా ద్వారా పరిచయమైన వారంతా నన్ను దేవుడిలా కొలుస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను. కళ్ళు చెమ్మగిల్లాయి. ఇదే విషయాన్ని వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పేవారు. 21 మంది దర్శకులు మా సంస్థ ద్వారా పరిచయమయ్యారు.
     రాముడు-భీముడు మళ్ళీ తీసే ఆలోచన ఎంతవరకూ వచ్చిందని అడిగితే... రాముడు-భీముడు మళ్ళీ తీయాలనే ఆలోచన ఉంది. జూ.ఎన్టీఆర్‌తో చేద్దాం అనుకున్నాను. ఇదే విషయం అతడికి చెప్పాను. తప్పకుండా చేద్దామన్నాడు. ఇప్పుడు ఆయన మాట్లడటంలేదు. మా రానా కూడా ఈ చిత్రం చేయాలనే ఆసక్తి ఉంది. అయితే జూ.ఎన్టీఆర్‌ చేస్తేనే ఆ సినిమాకు క్రేజ్‌ ఉంటుంది. అందుకే రానాకు సున్నితంగా వద్దని చెప్పాను. ప్రేమనగర్‌ మళ్ళీ తీయాలనే ఆలోచనలేదు. ఆ ప్రయత్నం కూడా కష్టమే. అవన్నీ కళాఖండాలు వాటిని అలాగే ఉంచాలి.
    1d మళ్లీ రాజకీయాలవు వైపు వస్తారా అంటే.. (చేతులెత్తి నమస్కరిస్తూ) అలాంటి ఆలోచన లేదు. రాజకీయాల్లో మా నియోజకవర్గానికి చేయాల్సినదంతా చేశాను. సొంతంగా ఏడున్నర కోట్లు ఖర్చు చేశాను. ప్రతి గ్రామంలో ఏదో ఒక పనిచేశాను. ఇక ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా వుంటాను. నేను రాజకీయాలకు అన్‌ఫిట్‌. ఈ విషయం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాక నాకు నేనుగా తెలుసుకున్న సత్యం. మా నియోజకవర్గం తోపాటు ఎన్నో ప్రాంతాలను స్వంత డబ్బులు 7కోట్లు ఖర్చు చేశాను. అప్పట్లో ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు... ఊరి వాళ్లు వచ్చి.. సార్‌.. పలానా వారు ఇంత ఇస్తున్నారు. మీరు ఇంతకంటే అంటూ... కొంత మంది పెద్దలు వచ్చి అడిగారు.. నేను షాక్‌ అయ్యా ను... మనం ఎన్నో మంచి పనులు చేశాం. డబ్బులి స్తేనేగానీ వేయరంటే ఎలా? అని అడిగాను... ఇంకా మీరు పూర్వకాలంలో వున్నారంటూ.. వచ్చిన వాళ్లు అనడం తో.. చాలా ఫీలయ్యాను. ఆ తర్వాత రిజల్ట్‌ తెలిసిందే.
     సినిమారంగంవల్ల మీకు జరిగిన ఉపకారాలేమైనా వున్నాయా అనడిగితే.. నాకంటే నా ఊరివాళ్ళకు చాలా ఉపయో గాలు చేయడానికి నిర్మాత అనే బ్రాండ్‌ బాగా ఉపయోగ పడింది. నేను ఎంపీ అయ్యాక మా ఊరితోపాటు నా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్ని అభివృద్దిచే యడానికి ఫండ్‌ కోసం ప్రయత్నాలు చేశాను. మా ఏరియాలో రైల్వేలైన్‌ అభివృద్ధికి ఫండ్‌ కావాల్సి వచ్చినప్పుడు బెంగాల్‌ మంత్రి రైల్వేమంత్రిగా వున్నారు. నేను వారిని కలిసి వివరాలు చెప్పాను. నాతోపాటు కలెక్టర్‌ వున్నారు. ఈయన నిర్మాత అన్నారు. ఏం నిర్మాత. ఏం సినిమాలు తీశారని అడిగారు. నేను తెలుగు, తమిళంతోపాటు.. అప్పటికీ బెంగాలీలో కూడా తీసిన సినిమాల పేర్లు చెప్పాను. వెంటనే ఆ మంత్రి ఫండ్‌ శాంక్షన్‌ చేశారు. ఇలా పలు సందర్భాల్లో నిర్మాత బ్రాండ్‌ చాలా ఉపకరిం చింది.
     రోజువారి మీ దినచర్య ఎలా ఉంటుంది వివరించండి.. ఉదయం ఐదుగంటలకే నిద్రలేస్తాను. 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌. 11 గంటలకు టీ, ఒంటిగంటకు మధ్యాహ్న భోజనం, ఆ తర్వాత కొంసేపు విశ్రాంతి, సరిగ్గా మూడున్నరకు టీ తాగి ఆఫీసుకు చేరుకుంటాను. సాయంత్రం నానక్‌రామ్‌గూడా స్టూడియోకు వెళతాను. అక్కడే తోటలో కూరగాయలు సేకరించుకుని ఇంటికి చేరుకుంటాను. రాత్రికి భోజనం చేస్తాను. ప్రతి రోజు వాకింగ్‌ తప్పనిసరి. ఇంతవరకు ఆరోగ్య సమస్యలు ఏవీలేవు అని చెప్పారు మన రామానాయుడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh and trivikram combination
Super star mahesh babu new entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles