Actress meena rejects ram charan film offer

actress meena rejects ram charan film offer

actress meena rejects ram charan film offer

3.gif

Posted: 06/06/2012 01:31 PM IST
Actress meena rejects ram charan film offer

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - వివి వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాకి 'చెర్రీ' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి ఇంతకు ముందే వివరించాం.2eee ఇక ఈ సినిమాకు సంబంధించి తాజా వార్త ఏంటంటే..  ఈ మూవీలో చెర్రీ అత్త పాత్రకి మంచి గ్లామర్ గా ఉండే నిన్నటి తరం కథానాయిక అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు, కొంత మంది నాయికల పేర్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య  పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైన మీనా వాళ్ల దృష్టిలో పడింది. ఇప్పటికీ అదే గ్లామర్ తో కనిపిస్తోన్న మీనా, ఈ పాత్ర  పోషిస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు. గతంలో ఆమె చిరంజీవి జోడీగా దుమ్ము దులిపేసింది కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటుందని భావించి, ఆమెని సంప్రదించారట. విషయమంతా విన్న మీనా, ప్రస్తుతం తాను ఇల్లాలి పాత్రలో తీరిక లేకుండా ఉన్నాననీ ... అందువల్ల తాను చేయలేనని సున్నితంగా చెప్పేసిందట. దాంతో దర్శక నిర్మాతలు ఉసూరుమన్నట్టు తెలుస్తోంది. మీనాకి అత్త పాత్ర  అంటే ఇష్టం లేక పోవడం వల్లనే అలా చెప్పిందని విమర్శకులు అంటున్నారు. ఇక ఈ మధ్య  నాగ చైతన్య కి అత్తగా నటించమంటే భూమిక కూడా నో చెప్పిన సంగతి తెలిసిందే. అలా అయితే.. మన మీనా ఏపాత్రలో ప్రేక్షకులను అలరించాలనుకుంటుందో తేలడంలేదు..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood hero john abraham court case
Movie moghal d ramanaidu birthday special story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles