Ntr national award for malasri

ntr national award for malasri

ntr national award for malasri

37.gif

Posted: 06/03/2012 05:27 PM IST
Ntr national award for malasri

      ప్రముఖ సినీ నటి మాలాశ్రీకి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది.  ప్రఖ్యాత కన్నడ చలన చిత్ర నిర్మాత, హాస్య నటుడు ద్వారకేశ్, ప్రముఖ సినీనటి మాలాశ్రీలకు 2012 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ పుర స్కారాలను ప్రదానం చేయనున్నారు.f పురస్కారాల ప్రదానోత్సవం నగరంలోని రేస్ కోర్సు రోడ్డులోగల భారతీ య విద్యాభవన్‌లో సోమవారం జరుగనుంది. ఈ విషయాన్ని కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణ రాజు, ప్రధాన కార్యదర్శి సి.వి.శ్రీనివా సయ్య, యశస్విని చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి ఆర్.ఉమాపతి నాయుడు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వరుసగా ఐదో యేడాది కన్నడ నటులకు ఎన్టీఆర్ అవార్డులను ప్రదానం చేయబోతున్నట్లు ప్రకటించారు. గతంలో ఈ అవార్డులను సినీ నటి తార, బి.సరోజాదేవిలకు అందచేశామన్నారు. యేటా ఇద్దరికి అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. కన్నడ సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకున్న ద్వారకేశ్, మాలా శ్రీలు వందలాది చిత్రాల్లో నటించి లక్ష లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. ఈ అవార్డు పొందటంపై మాలాశ్రీ చాలా ఆనందాన్ని వెలిబుచ్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sp balu birthday today
Special story on ilayaraja  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles