Pawan kalyan range in high

pawan kalyan range in high

pawan kalyan range in high

3.gif

Posted: 05/31/2012 01:01 PM IST
Pawan kalyan range in high

      పవన్ కళ్యాణ్ అభిమానులకు, అతన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఇవాళ కనులపంట కానుంది.  సాధారణంగా తన సినిమాల విజయోత్సవాలలో పాల్గొనడానికి ఇష్టపడని పవన్ తాజాగా అందుకు అంగీకరించాడు. 'గబ్బర్ సింగ్' సినిమా సాధిస్తున్న విజయాల నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో డిస్క్ ఫంక్షన్ ను నిర్వహించడానికి నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేశాడు.  ఇవాళ (మే 31) సాయంకాలం హైదరాబాదులో ఘనంగా జరిగే ఈ వేడుకలో పవన్ కల్యాణ్ పాల్గోబోతున్నాడు. ఈ కార్యక్రమాన్ని తెలుగు టీవీ చానెల్స్ అన్నీ లైవ్ టెలికేస్ట్ చేయనున్నాయి. పవన్ తో బాటుగా చిత్ర దర్శకుడు, కథానాయిక, సంగీత దర్శకుడు తదితర యూనిట్ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు.
    3a ఇదిలా ఉంటే..  సాధారంణంగా,  ఒక సినిమాలో నటించినందుకు ఆ సినిమా హీరోకి పారితోషికం ముందే నిర్ణయమైపోతుంది. తన డిమాండును బట్టి ఎంత తీసుకోవాలో అంతా తీసేసుకుంటాడు. ఇక ఆ సినిమా జయాపజయాలతో అతనికి సంబంధం వుండదు. అయితే, ఇప్పుడు సంచలన విజయం సాధించిన 'గబ్బర్ సింగ్' సినిమాకి పవన్ కల్యాణ్ ఎంత పారితోషికం తీసుకున్నాడన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
     అయితే, ఈ సినిమాకి హీరో పారితోషికం గురించి మొదట్లో ఏమీ మాట్లాడుకోలేదని తెలుస్తోంది. అసలు ఈ సినిమాని పవన్ తన బ్యానర్ పై సొంతంగా నిర్మించాలనుకున్నాడు.  కానీ, అంతకు ముందే నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన 'తీన్ మార్' సినిమా ఫ్లాప్ కావడంతో, అతనికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో, ఈ 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని తీసుకోమని పవన్ అతనికి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని స్వతహాగా బండ్ల గణేష్ సభాముఖంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
     గబ్బర్ సింగ్ పారితోషికం గురించి కూడా పవన్ ఏమీ కండిషన్లు పెట్టలేదట. 'ముందు సినిమా తీసుకో ... రిలీజయ్యాక చూసుకుందాం' అన్నాడట పవన్. ఇప్పుడిది అనూహ్య విజయాన్ని సాధించి, లాభాలు 40 కోట్ల వరకు లెక్కతేలుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో, ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో పవన్ పారితోషికాన్ని సెటిల్ చేయాలని నిర్మాత గణేష్ అనుకుంటున్నాడట. అంటే, ఎంత లేదన్నా పవన్ పారితోషికం 20 కోట్ల వరకు ఉంటుందని చెప్పచ్చు. మరి, ఇకపై కూడా పవన్ పారితోషికం ఇదే రేంజ్ లో ఉంటుందా? అన్నదే ఇప్పుడు అందరిలోనూ కుతూహలం రేపుతోంది. ఏమో చెప్పలేం.. పవన్ రేంజ్ ను బట్టి అయినా కావచ్చు..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramgopal varma jagan lagadapati
Superstar krishna birthday today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles