Kovai sarala and brahmanandam made devudu chesina manushulu

kovai sarala and brahmanandam made devudu chesina manushulu

kovai sarala and brahmanandam made devudu chesina manushulu

21.gif

Posted: 05/29/2012 03:27 PM IST
Kovai sarala and brahmanandam made devudu chesina manushulu

       పూరీ జగన్నాథ్ ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం స్టోరీ లైన్ ఏమిటి అనేదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం….ఈచిత్రం టైటిల్‌కు తగిన విధంగానే సినిమా స్టోరీ ఉందని స్పష్టం అవుతోంది. బ్రహ్మానందం, కోవై సరళ దేవుళ్లుగా విష్ణుమూర్తి, లక్ష్మి దేవి పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు.dc  ఒక రోజు లక్ష్మిదేవి తెలుగు సినిమా చూడాలనికుటుంది. అయితే అది రీల్‌లో కాకుండా రియల్ లైఫ్‌లో విష్ణుమూర్తి సృష్టించిన పాత్రలతో చూడాలనుకుంటుంది. తొలుత విష్ణుమూర్తి ఇందుకు ఒప్పుకోక పోయినా….నారదుడు(జూనియర్ రేలంగి) కల్పించుకుని విష్ణుమూర్తిని ఒప్పిస్తాడు.  ఈ మేరకు పాత్రల రూపకల్పన చేసిన విష్ణుమూర్తి….రవితేజను ఇండియాలో, ఇలియానాను బ్యాంకాక్‌లో పుట్టిస్తాడు. ఈ రియల్ లైఫ్ సినిమాలో లక్ష్మి దేవి నవరసాలైన రొమాన్స్, కామెడీ, యాక్షన్, సెంటిమెట్ ఇలా అన్నీ ఉండాలని కోరుకుంటుంది.brahee ఈ క్రమంలో లార్డ్ విష్ణు ఇవన్నీ ఆయా పాత్రలకు యాడ్ చేస్తూ ఉంటాడు. ఇలా పలు రకాల ట్విస్టులతో సినిమా సాగుతూ ఉంటుందట.
       మాస్ మహారాజ రవితేజ, అందాల తార ఇలియానా, క్రేజీ దర్శకుడు పూరి కాంబినేషన్లో తాజాగా రూపొందుతున్న ‘దేవడు చేసిన మనుషులు’. చిత్రం స్టాటస్ విషయానికొస్తే…ఈ చిత్రం టాకీ పార్టు షూటింగ్ మొత్తం పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం డబ్బింగ్ పనులు అండర్ ప్రొగ్రెస్‌లో ఉన్నాయి. తాజాగా కమెడియన్ బ్రహ్మానందం శబ్దాలయా స్టూడియోలో తన డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నారు. మరో వైపు హీరో, హీరోయిన్లు రవితేజ, ఇలియానాలపై ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు.
      ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అదిస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఆడియో విడుదల చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జులై నెలలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బివిఎస్ ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu and boyapati srinu movie
Ram charan upasana marriage website  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles