Ramcharan and vv vinayak movie shooting in hyderabad

ramcharan and vv vinayak movie shooting in hyderabad

ramcharan and vv vinayak movie shooting in hyderabad

17.gif

Posted: 05/28/2012 04:13 PM IST
Ramcharan and vv vinayak movie shooting in hyderabad

      హైదరాబాద్ లో చరణ్-వినాయక్ మూవీ షూటింగ్ ఇవాళ కోలాహలాన్ని రేకెత్తించింది. 'రచ్చ' సినిమాతో మాస్ ఆడియన్స్ కి వినోదాల విందు చేసిన చరణ్,  ఓ వైపు హిందీ ఫిల్మ్ జంజీర్, మరోవైపు 'ఎవడు' సినిమా షూటింగ్ తోను,  ఇంకో వైపున వినాయక్ తెర కెక్కిస్తోన్న సినిమా షూటింగ్ తోను బిజీబిజీగా వున్నాడు.ram_e ప్రస్తుతం  వినాయక్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా షూటింగ్ లో చరణ్   పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ -  బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 8 లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. చరణ్ అభిమానులు తమ హీరో వర్కింగ్ స్టిల్ చూసేందుకు ఆరాటపడ్డారు. ఓ ప్రైవేటు బంగ్లాలో జరుగుతోన్న ఈ షూటింగ్ లో చరణ్ ... రాహుల్ దేవ్ ... రఘుబాబు ... తదితరులు పాల్గొంటున్నారు. ఈ పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నట్టు చెబుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా చరణ్ స్టైల్లో ... వినాయక్ మార్క్ తోనే ఉంటుందని సమాచారం.  కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్స్ లో పాల్గొంటున్న చరణ్ పెళ్లి లోపు ప్రాజక్టులను ఓ కొలిక్కి తెచ్చేందుకు శ్రమిస్తున్నాడు.

      కాగా,  'మగధీర'లో 'బంగారు కోడిపెట్ట...', 'రచ్చ'లో 'వానా వానా వెల్లువాయే...' పాటల్ని రీమిక్స్ చేసి, అభినందనలు అందుకున్న చరణ్ తాజాగా వినాయక్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలో చిరంజీవి మరో పాపులర్ సాంగ్ రీమిక్స్ చేయబోతున్నాడని తెలుస్తొంది. చిరంజీవి, భానుప్రియ జంటగా 1988 లో వచ్చిన 'ఖైదీ నెం 786' చిత్రంలోని 'గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట....' హిట్ సాంగ్ కి నేటి హీరో హీరోయిన్లు చరణ్,కాజల్ స్టెప్పులేస్తారని సమాచారం.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh overseas records break
Film actor balakrishna talk about ysr congress president jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles