Film actor balakrishna talk about ysr congress president jagan

film actor balakrishna talk about ysr congress president jagan

film actor balakrishna talk about ysr congress president jagan

15.gif

Posted: 05/28/2012 03:45 PM IST
Film actor balakrishna talk about ysr congress president jagan

      మొత్తానికి అధినాయకుడు నోరువిప్పాడు.  జూన్ 1 న విడుదల కానున్న 'అధినాయకుడు' సినిమాలో వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, బాలకృష్ణ కొన్ని డైలాగులు చెప్పినట్టుగా  టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.bala_e  ఈ నేపథ్యంలో వీటికి బలాన్ని చేకూరుస్తూ హీరో బాలకృష్ణ ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'అవును... అధినాయకుడు సినిమాలో కొందరిని ఉద్దేశిస్తూ కొన్ని సంభాషణలు వున్న సంగతి వాస్తవమే' అన్నారు బాలకృష్ణ. అంతేకాదు.. ఆర్ధిక నేరాల కేసులో నిన్న అరెస్టయిన జగన్ కు శిక్ష తప్పదని బాలకృష్ణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. జగన్ పై ఎప్పుడూ విమర్శలు కానీ, కామెంట్లు కానీ చేయని బాలకృష్ణ తొలిసారిగా ఇలా వ్యాఖ్యానించడం సంచలనాన్ని రేకెత్తించింది.
      బాలకృష్ణ తొలిసారిగా త్రిప్రావూతాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీరాయ్, సలోని కథానాయికలు.bal_e2 ‘బాలకృష్ణ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తయారుచేసుకున్న కథాంశమిది. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం తపించేవాడే సిసలైన అధినాయకుడు అనే అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం. బాలకృష్ణ అభిమానుల్ని రంజింపజేసే అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయి. మూడు విభిన్న పాత్రల్లో బాలకృష్ణ అభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. యాక్షన్‌తో పాటు చక్కటి సెంటిమెంట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు వెల్లడిస్తున్నాడు.
జయసుధ, కోట శ్రీనివాసరావు, చరణ్‌రాజ్, బ్రహ్మానందం, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, సంగీతం: కల్యాణిమాలిక్, సమర్పణ: సందీప్. అష్టకష్టాలకోర్చి వచ్చేనెల మొదటి రోజు విడుదలౌతోన్న ఈ సినిమా బాలయ్య బాబు తాజా వ్యాఖ్యలతో ఇంకెలాంటి కంపనలు పుట్టిస్తుందో చూడాలి. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan and vv vinayak movie shooting in hyderabad
Mahesh babu boyapati movie rular in  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles