నాలుగు దశాబ్దాల పాటు తన నటనా చాతుర్యంతో తెలుగు ప్రజలను అలరించి, మెప్పించారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామరావు. సరిగ్గా 89 ఏళ్ల క్రితం నిమ్మకూరులో జన్మించిన తారక రాముడు తెలుగు ప్రజలపై బలమైన ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాల పాటు తన నటనతో ఎన్నటికి మరవని, ఎప్పటికి మరిచిపోలేని పాత్రల్లో జీవించారు ఎన్టీఆర్. చెప్పుకోవడానికి ఒక సినిమా కాదు. ఒక పాత్ర కాదు. వందలాది సినిమాల్లో తన నటనతో అలరించి కోట్లాది మంది ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారాయన. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపుగా 302 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలచిపోయారు ఎన్టీఆర్. మనదేశం ఆయన మొదటి సినిమా. 1949లో వచ్చిన ఈ సినిమాలో ఆయన పోలీసు ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. 1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్ర హారం ఎన్టీఆర్‌కు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి.
ఆయన నటించిన పాతాళభైరవి భారీ విజయం సాధించింది. 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. 1956లో విడుదలైన మాయాబజార్లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అప్పట్లో . 1959లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. ఆ కాలంలో ఏడాదికి 10 సినిమాల్లో నటించే వారు ఎన్టీఆర్. 1963లో విడుదలైన లవకుశ భారీ విజయాన్ని అందించింది.
ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. తన "నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్" బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేసారు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆయన్ని అగ్రపథంలో నిలబెట్టాయి. ఒక మహ నటుడిగా నందమూరి తారక రామరావు మనందరి మధ్య లేకపోయినా అయన తెలుగు అభిమానుల గుండెల్లో ఉన్నారు. ఆ మహానటుడి జయంతి సందర్భంగా ఆంధ్రావిశేష్.కాం ఆయన సినీ కళామతల్లికి చేసిన సేవలను జ్నప్తికి తెచ్చి మనసారా స్మరించుకుంటుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more