Akkineni nagarjuna says about his latest film damarukam

akkineni nagarjuna says about his latest film damarukam

akkineni nagarjuna says about his latest film damarukam

1.gif

Posted: 05/25/2012 01:12 PM IST
Akkineni nagarjuna says about his latest film damarukam

 

nag_eeee

nag_exxసాధారణంగా నాగార్జున తన సినిమాల గురించి ఎక్కువగా చెప్పరు. తను ఏ సినిమా చేసినా అది అదర గొడుతుందంటూ ఆయన ఎప్పుడూ హడావిడి చేయలేదు. అలాంటి నాగార్జున 'డమరుకం' సినిమా తన కెరియర్ లోనే హైరెంజ్ సినిమా అవుతుందంటూ నోరు విప్పారు. ఇది తాను నటించిన తొలి ఫాంటసీ చిత్రమని చెప్పారు. అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ... భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగిందని అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ ... అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోను నిరాశ పరచదని చెప్పారు. పబ్లిసిటీ పరంగా తన సినిమాల విషయంలో పల్లెత్తు మాట చెప్పని నాగార్జున, ఈ సినిమా గురించి ఇన్నేసి విషయాలు చెప్పాడంటే ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్ ప్రభావమేనని పరిశీలకులు అంటున్నారు.

      eyyy ఆర్.ఆర్.మూవీమేకర్స్ బ్యానర్ పై వెంకట్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నాగ్ సరసన అనుష్క నటిస్తోన్న ఈ సినిమాని జూలై రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత చెప్పారు. కొత్తగా విడుదల చేసిన ఈ మూవీ స్టిల్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. నాగ్ చెప్పినట్టుగానే ఈ చిత్రాల్లో భారీ తనం, క్వాలిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాలు మీరూ చూడండి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Powerstart brand in open market
Charan vinayak movie title cherry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles