Jagan story in krishna vamsi movie

jagan story in krishna vamsi movie

jagan story in krishna vamsi movie

13.gif

Posted: 05/24/2012 04:25 PM IST
Jagan story in krishna vamsi movie

      jagan-_inner జగన్ సినిమాల్లో నటిస్తున్నాడా... అని ఆశ్యర్యపోకండి.. జగన్ జీవిత నేపధ్యంతో కృష్ణ వంశీ సినిమా రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..  నాని హీరోగా కృష్ణవంశి రూపొందిస్తోన్న 'పైసా' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ... కథానాయకుడు ముఖ్యమంత్రి కావడం కోసం తపిస్తాడట. తాను అనుకున్నది సాధించడం కోసం తనకున్న డబ్బునీ ... పవర్ ని ఉపయోగిస్తాడు. అధికారం కోసం అన్నింటికీ తెగించి తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే క్రమమే ఈ చిత్రకథాంశంగా తెలుస్తోంది.  
      వై.యస్. జగన్ పాత్రని నాని పోషిస్తున్నాడంటూ ఫిల్మ్ నగర్లో వార్తలు షికారు చేస్తున్నాయి.  గతంలో సామాజిక చైతన్యాన్ని ఆశించి కృష్ణ వంశీ తెరకెక్కించిన 'సింధూరం', 'ఖడ్గం' 'మహాత్మా' వంటి చిత్రాలకి మంచి ఆదరణ లభించింది. krish_nani ఇప్పుడు అవినీతి రాజకీయ నేపథ్యాన్ని ఆయన కథా వస్తువుగా చేసుకున్నాడు కాబట్టి, జగన్ ని దృష్టిలో పెట్టుకునే నాని పాత్రని మలిచారని అంతా అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలేననీ ... ఈ ప్రచారం లో ఏ మాత్రం నిజంలేదని చిత్ర నిర్మాత పుప్పాల రమేష్  కొట్టిపారేస్తున్నారు.  నాని పాత్రని ఏ రాజకీయ నాయకుడిని దృష్టిలో పెట్టుకుని రూపొందించ లేదనీ ... ఎవరిని ప్రేరణగా తీసుకోలేదని చెబుతున్నారు. ఊహాగానాలు మాత్రం పై విధంగా ఉన్నాయి.. ఇదీ సంగతీ..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Evadu seetamma vakitlo cirimalle chettu producer dil raju tension
Actress kalyani political entry in andhra pradesh politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles