Rasna beby funeral

rasna beby funeral

rasna beby funeral

22.gif

Posted: 05/17/2012 06:52 PM IST
Rasna beby funeral

      నేపాల్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాలనటి తరుణి సచ్ దేవ్(14), ఆమె తల్లి గీత అంత్యక్రియలు ముంబాయిలో ముగిశాయి. స్థానిక శాంతాక్రజ్ శ్మశానంలో వీరి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ చిన్నారి మాట తలుచుకుంటే ప్రతి భారాతీయుని గుండె బరువెక్కిపోతోంది. 5 ఐ లవ్ యూ రస్నా అంటూ ముద్దు ముద్దు మాటలతో కోట్లాదిమంది భారతీయులకు పరిచయమైన  14 ఏళ్ల రస్నాబేబి తరుణి సచ్‌దేవ్ విమాన ప్రమాదంలో మృతి చెందింది. నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బేబి తరుణితో పాటు ఆమె తల్లి గీతా సచ్‌దేవ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
      ఐ లవ్ యూ రస్సా అంటూ తరుణి చెప్పిన మాటలు ఇంటింటా మార్మోగడంతో దేశీయ మార్కెట్‌లో రస్నా పానీయానికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. రస్నాతో పాటు వివిధ ఉత్పత్తులకు సంబంధించి తరుణి సుమారు 50 వాణిజ్య ప్రకటనల్లో పాల్గొంది. ఎన్ని ‘యాడ్ ఫిల్మ్’లు చేసినప్పటికీ ఈమె ‘రస్నా గర్ల్’గానే జనం గుండెల్లో గుర్తుండిపోయింది.6 వాణిజ్య ప్రకటనల్లోన గాక హిందీ, మలయాళం సినిమాల్లోనూ నటించి ‘రస్నా గర్ల్’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
      ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ నటించిన ‘పా’లో తరుణి అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మలయాళంలో ‘వెల్లినక్షత్రం’, ‘సత్యం’ సినిమాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఓ చానల్‌లో నిర్వహించిన రియాలిటీ క్విజ్ షోలో పాల్గొన్న తరుణి  ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ చిన్నారి ఆకస్మిక మరణం గురించి తెలిశాక తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన అమితాబ్ బచ్చన్ దిగ్బ్రాంతి చెందారు. దేవుడా ఈ వార్త నిజం కాకుండా చూడు..అంటూ ట్విట్టర్‌లో రాశాడు. అంతే కాదు ఇంకా ఎన్నో సంతాప సందేశాలు ఆ బంగారుతల్లిని పలుకరిస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lady gaga hungama
Swami vivekananda life history  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles