Kasturi raja blame producer nattikumar

kasturi raja blame producer nattikumar

kasturi raja blame producer nattikumar

5.gif

Posted: 05/14/2012 01:21 PM IST
Kasturi raja blame producer nattikumar

       '3 ' సినిమా విడుదలై పరాజయం పాలై సోదిలో లేకుండా పోయినప్పటికీ రగడ మాత్రం కొనసాగుతోంది. ఈ మూవీ బాక్సులు రెండు రోజులకే వెనక్కి వెళ్లిపోయినా, ఈ సినిమా అనువాదపు హక్కుల విషయంలో తలెత్తిన సమస్యలు మాత్రం రోజు రోజుకీ ముదురుతూనే వున్నాయి.naa ఈ సినిమా ఫ్లాపవడంతో నష్టపరిహారం వస్తుందంటూ, ఆ మధ్య ఈ సినిమా తెలుగు వెర్షన్ నిర్మాత నట్టి కుమార్ నానా హడావిడి చేశాడు. చివరికి రజనీకాంత్ స్వయంగా జోక్యం చేసుకుని, తనకూ, ఈ సినిమాకూ సంబంధం లేదంటూ ప్రకటన ఇవ్వాల్సివచ్చింది. ఈ విషయంలో తనని 'త్రీ' సినిమా ఒరిజినల్ వెర్షన్ నిర్మాత కస్తూరి రాజా మోసం చేశాడంటూ నట్టికుమార్ ఆరోపించాడు. అయితే అప్పటినుంచి కూడా ఈ సమస్య రాజుకుంటూనే వుంది. తాజాగా నట్టికుమార్ వ్యవహార శైలి పట్ల కస్తూరిరాజా స్పందిస్తూ, చెన్నైలోని తన సంస్థ కార్యాలయంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.n
       ఇందులో నట్టిపై పలు ఆరోపణలు కురిపించాడు.  ఈ సినిమా అనువాదపు హక్కులకి సంబంధించిన లావాదేవీలలో మొదటి నుంచి కూడా తమని నట్టి కుమార్ మోసం చేస్తూనే వచ్చాడనీ ... ఫలితంగా తాను 10  కోట్లు నష్టపోయానని అన్నారు. ఆయనని స్పూర్తిగా తీసుకున్న తమిళ బయ్యర్లు కొందరు తనని మోసం చేశారని చెప్పారు. అనువాదపు హక్కులు కొనుగోలు చేసి, నట్టి కుమార్ తనకి ఇచ్చిన 3 చెక్కులు బౌన్స్ అయ్యాయని చెబుతూ, మీడియాకి ఆ చెక్కులని చూపించారు. అగ్రిమెంట్ - ఆడియో రైట్స్ విషయంలో అతను చేస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. ఇక పై ఆయన తమపై ఎలాంటి ప్రేలాపనలు పేలినా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు రాజా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stylish star allu arjun another movie
Gabbar singh director harish shankar says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles