Grand arrangements for ram charan marriage

Grand, arrangements, for, Ram, Charan, and, Upasana, marriage, telugu, cinema, news, hotpics, tollywood, film, Cinema, Sites, movies, masalapics, heros

Chiranjeevi son Ram Charan Teja, Upasana Kamineni wedding will be held at Himayatsagar farmhouse on June 14. They will have grand marriage, reception event

Grand arrangements for Ram Charan marriage.gif

Posted: 05/12/2012 01:14 PM IST
Grand arrangements for ram charan marriage

Ramchran_Upasana

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు కామినేని ఉపాసనను ప్రేమ వివాహం చేసుకోబుతున్న విషయం తెలిసిందే. వీరి వివాహం జూన్ 14 న జరగనుంది. ఈ వివాహం హిమాయత్ సాగర్ లోని ఉపాసన వాళ్ళ ఫాంహౌజ్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

వీరి వివాహానికి ఇప్పటి నుండే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ వివాహ వేడుకకి ఇటు సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు, రాజకీయ రంగానికి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతారు. అంతే కాకుండా ఉపాసన వాళ్ళ కుటుంబం తరుపున వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులు ఈ వేడుకకి వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి ఈ వివాహ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలవారు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్ళికి వచ్చే పెద్దల కోసం ఇప్పటికే నగరంలోని అన్ని ప్రముఖ హోటల్స్ ని బుక్ చేసినట్లు సమాచారం. అంతే కాకుండా పెళ్ళికి వచ్చే వారి కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తున్నాయి.  ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనంత గ్రాండ్ గా ఈ వివాహాన్ని జరపడానికి ఏర్పట్లు చేస్తున్నారు. మరి మెగాస్టార్ కొడుకు పెళ్లి చరిత్రలో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan says dating siddharth roy kapoor
Sneha and prasanna get married  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles