Achala sachdev passes away

achala sachdev passes away

achala sachdev passes away

13.gif

Posted: 05/01/2012 03:00 PM IST
Achala sachdev passes away

        achala_inn1 అలనాటి బాలీవుడ్ నటీమణి అచలా సచ్‌దేవ్ (91) కన్నుమూసారు.  ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1920లో జన్మించిన అచలా.. తన 18వ ఏట 1938లో 'ఫ్యాషనబుల్ వైఫ్' చిత్రంతో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. అప్పటినుంచి దాదాపు 130కి పైగా సినిమాల్లో నటించిన ఆమె.. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో పుణె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హ కీకత్, వక్త్, మేరా నామ్ జోకర్, జూలీ లాంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసలు అందుకుంది. చిట్టచివరిగా ఆమె 2002లో విడుదలైన హృతిక్ రోషన్ చిత్రం 'న తుమ్ జానో న హమ్'లో నటించారు.
        ప్రస్తుత తరానికి ఆమె ఎక్కువగా తల్లి లేదా నాయనమ్మ పాత్రలలోనే పరిచయం. 2011 సెప్టెంబర్‌లో వంటగదిలో జారి పడటంతో ఆమె కాలు విరిగింది. తర్వాత మెదడులో రక్తం పలుచోట్ల గడ్డకట్టడంతో పక్షవాతంతో పాటు దృష్టి కూడా పోయింది. కొన్ని రోజుల క్రితం ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని, అప్పటినుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారు. చివరకు సోమవారం తుదిశ్వాస విడిచారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actor giribabu joins ysr congress party
Sri ramgam srinivasarao birth day today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles