Actress samantha birth day today

actress samantha birth day today

actress samantha birth day today

21.gif

Posted: 04/28/2012 03:59 PM IST
Actress samantha birth day today

      sama_in1 అందాల భామ సమంతా, తెలుగు తెరపై వెలిగిపోతోంది. అనతి కాలంలోనే పెద్ద హీరోయిన్ అయికూర్చుంది. 'ఎ మాయ చేశావే' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన అమ్మడు, కుర్రకారు ప్రేక్షకుల హృదయాలను హోల్ సేల్ గా దోచేసింది. ఆ తరువాత 'బృందావనం' లో రాధగా రక్తి కట్టించి, 'దూకుడు' సినిమా సక్సెస్ తో అగ్ర కథానాయికల జాబితాలో అవలీలగా చేరిపోయింది. ఈ మూడు సినిమాలు కూడా సమంతా అంటేనే సక్సెస్ అని నిరూపించడంతో, అవకాశాలన్నీ అమాంతంగా వచ్చి పడ్డాయి.
       సమంతా, ప్రస్తుతం తెలుగు - తమిళ - హిందీ చిత్రాలతో యమా బిజీగా వుంది. ఇక తమిళ - హిందీ సినిమాల సంగతి పక్కన పెడితే, ఒక్క తెలుగులోనే ఆమె నటించిన 'ఈగ' ... 'ఆటో నగర్ సూర్య' ... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ... 'ఎటో వెళ్ళిపోయింది మనసు' వంటి పెద్ద సినిమాలు త్వరలో ప్రేక్షకులముందుకు రానున్నాయి.
      మొన్నీమధ్య సావిత్రి తరువాత అంతటి ఫెయిర్ స్కిన్ వున్నది సమంతాకేనని అక్కినేని అనడం ఆమె అందానికి దక్కిన అరుదైన సత్కారం అనక తప్పదు. ఈ అందాల భామ ఇవాళ తన పుట్టిన రోజును  ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో జరుపుకుంటోంది. ఈ అందాల రాసికి ఆంధ్రావిశేష్ జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది. మెనీ మెనీ హ్యపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే సమంతా.......

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director sv krishna reddy hollywood entry
Milky beauty tamanna clarifies in kaarti issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles