Mahesh movie shooting in a big way at annapoorna studios

mahesh movie shooting in a big way at annapoorna studios

mahesh movie shooting in a big way at annapoorna studios

12.gif

Posted: 04/26/2012 04:32 PM IST
Mahesh movie shooting in a big way at annapoorna studios

           mahe_in1 బిజినెస్ పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రేంజ్ పెరిగిపోవడంతో అతని సినిమాల బడ్జెట్ కూడా పెరిగిపోతోంది. పాటల్ని, యాక్షన్ ఎపిసోడ్స్  కాస్ట్లీగా చిత్రీకరించడానికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం బడ్జెట్ కూడా అలాగే భారీగానే వుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను హైదరాబాదు అన్నపూర్ణా ఏడెకరాల లొకేషన్లో వేసిన భారీ సెట్లో లావిష్ గా షూట్ చేస్తున్నారు.
                 సినిమాలో ఇది మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ కావడంతో రిచ్ నెస్ కోసం ఇందులో 2000 మంది అందమైన మోడల్స్ ను పెట్టారు. మహేష్ బాబు ఈ పాట చిత్రీకరణలో పాల్గొనడానికి ముందుగానే వీరిపై కొన్ని షాట్స్ ను చిత్రీకరించేసారట. ప్రస్తుతం మహేష్ బాబుతో పాటు 600 మంది మోడల్స్ ఈ షూటింగులో పాల్గొంటున్నారు. అలాగే, ఈ 27 నుంచి ఓ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా రిచ్ గా తీయడానికి ప్లాన్ చేశారు.mahe_su
                 అంతేకాదు,  ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్ అధ్వర్యంలో  అన్నపూర్ణ స్టూడియో చిత్రీకరిస్తోన్న ఒక పాట కోసం ప్రత్యేకంగా ముంబై నుండి 12 ఎమ్ఎమ్ రెడ్ కెమెరా తెప్పించారు. గతంలో సుకుమార్ తో కలిసి ఆర్య, జగడం మరియు రోబో వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాలకు పనిచేసిన రత్నవేలు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ రోజు వరకు పాట చిత్రీకరణ చేసి రేపటి నుండి ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot actress neetu chandra hollywood entry
Young tiger ntr dammu release in a few hours  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles