Tamil super star rajani kanth movie coming in advance

tamil super star rajani kanth movie coming in advance

tamil super star rajani kanth movie coming in advance

13.gif

Posted: 04/18/2012 06:23 PM IST
Tamil super star rajani kanth movie coming in advance

              rajini_7355గత కొంతకాలంగా అనారాగ్యంతో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వెళ్లాలా అని చాలా ఆత్రం గా ఉన్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రజనీకాంత్ నటిస్తున్న 'కొచ్చాడియాన్' సినిమాను అనుకున్న సమయానికంటే ముందుగానే రిలీజ్ చేయాలని సంకల్పిస్తున్నారు. దీపావళికి విడుదల చేయనున్నట్టు మొదట్లో ప్రకటించారు. అయితే, నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండడంతో, ఇంకా ముందుగానే అంటే సెప్టెంబర్ లోనే చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అభిమానులకు తాజాగా శుభవార్త చెప్పారు.
            కాగా,  ఈ చిత్రం షూటింగు విషయానికొస్తే, తాజా షెడ్యులు కేరళలో ప్రారంభమైంది. కేరళలోని అందమైన లొకేషన్లలో భారీ షెడ్యుల్ ని ప్లాన్ చేశారు. రజనీతో బాటు ప్రధాన తారాగణం ఈ షూటింగులో పాల్గొంటున్నారు. రజనీకాంత్ పక్కన బాలీవుడ్ భామ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రజనీ చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాలో రజనీ మెరుపునటనకు తోడు దీపికా అందాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Javed akhtar will hire a team of legal experts to take action against the makers for the remake of zanjeer
Prince mahesh babu busy with svsc shooting in  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles